Dailyhunt
టమాటాలు తింటే కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

టమాటాలు తింటే కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big TV Live 1 week ago

మాటాలు ప్రతి ఇంటి కిచెన్‌లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో సలాడ్, కూరలు, సూప్, సాస్‌లలో టమాటాలు వాడతారు. అయితే చాలా మంది టమాటాలు తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ (మూత్ర పిండాల్లో రాళ్లు) వస్తాయని భయపడతారు.

ఇందుకు కారణం టమాటాలలో ఆక్సలేట్స్ ఉండటం.

కిడ్నీ స్టోన్స్‌కు టమాటాలకు సంబంధం ఏంటి?

కిడ్నీ స్టోన్స్.. చాలా సార్లు కాల్షియం ఆక్సలేట్ శరీరంలో ఉప్పు లాంటి స్ఫటికాల వల్ల ఏర్పడతాయి. ఆక్సలేట్స్ అనేవి అనేక కూరగాయల్లో సహజంగా ఉంటాయి. టమాటాల్లో కూడా కొంత వరకు ఆక్సలేట్స్ ఉంటాయి. ఈ కారణంగానే కొందరు టమాటాల వల్లే కిడ్నీ స్టోన్స్‌ సమస్య వస్తుందని అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు.

నిజానికి టమాటాల్లో ఉండే ఆక్సలేట్స్.. పాలకూర, లేదా బీట్‌రూట్ కంటే చాలా తక్కువ. సగటున టమాటాలో ఆక్సలేట్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్నవారికి సాధారణంగా టమాటా తింటే ఏ సమస్య ఉండదు.

ఆరోగ్య నిపుణులు ఏమంటారు?

ప్రముఖ యురాలజిస్ట్ డాక్టర్ విశ్వాస్ ఎం. ప్రకారం.. టమాటా వల్ల కిడ్నీ స్టోన్ సమస్య వస్తుందనేది నిజం కాదని అపోహ అని చెప్పారు. టమాటాలు కూడా మితంగా తింటే సురక్షితమని తెలిపారు. కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి టమాటాలు మాత్రమే కాదు, నీరు తక్కువగా తాగడం, జన్యుశాస్త్రం, ఆహారం, జీవనశైలి అన్నీ కారణం. నీరు తక్కువ తాగడం స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం.

ఇప్పటికే కిడ్నీ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి

ఆరోగ్యంగా ఉన్నవారికి టమాటాలు సేఫ్. కానీ కిడ్నీలో తరచూ స్టోన్స్ ఏర్పడే సమస్య ఉన్నవారు ఆహారం తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. అధికంగా టమాటాలు తినడం వల్ల మూత్రంలో ఆక్సలేట్ కొద్దిగా పెరగవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉన్నవారు పొటాషియం కూడా గమనించాలి. టమాటాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

టమాటా గింజలు, సాస్ గురించి

చాలా మంది టమాటా గింజలు స్టోన్స్ కలిగిస్తాయని అంటారు. కానీ దీనికి బలమైన ఆధారాలు లేవు. తాజా టమాటాల కంటే సాస్ లేదా కాంసంట్రేటెడ్ ఉత్పత్తుల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని మితంగా తినడం చాలా ముఖ్యం.

మీ విజయాన్ని చూసి అసూయపడే వారు మీ చుట్టూనే ఉంటారు.. దీనికి కారణాలు ఇవే

నీళ్లు తాగడం ఎంతో ముఖ్యం

డాక్టర్లు స్టోన్స్ నివారణకు ఎక్కువగా నీరు తాగమంటారు. నీరు మినరల్స్‌ను పలచగా చేసి స్ఫటికాలు ఏర్పడకుండా చూస్తుంది. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తినడం మంచిది.

టమాటాలు గురించి ప్రజల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పూర్తిగా మానేస్తారు, మరికొందరు సాధారణంగా తింటూనే ఉంటారు. వైద్యుల సలహా తీసుకోవడం బెస్ట్. టమాటాలు ఒక్కటే కిడ్నీ స్టోన్స్‌కి కారణం కాదు. ఆరోగ్యంగా ఉన్నవారికి టమాటాలు తింటే ఎటువంటి ప్రమాదం ఉండదు. స్టోన్స్ సమస్య ఉన్నవారు డాక్టర్‌ సూచనల ప్రకారం ఆహారం మార్పులు చేసుకోవాలి. తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం ఎప్పుడూ ముఖ్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live