Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడులో విజయ్ గెలవడంలో ఆశ్చర్యం లేదు..నటి శ్రియ కామెంట్స్ వైరల్!

తమిళనాడులో విజయ్ గెలవడంలో ఆశ్చర్యం లేదు..నటి శ్రియ కామెంట్స్ వైరల్!

Big TV Live 2 weeks ago

Shriya saran: తమిళనాడులో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యానికి గురిచే చేశాయి. తమిళనాడులో డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతూ ఉన్నారు.

అయితే ఇలా దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీలను విజయ ఓడించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్(Vijay) టీవీకే(TVK Party) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పెట్టిన కేవలం రెండు సంవత్సరాలకి ఈయన ఎన్నికలలో పోటీ చేశారు. ఇలా రెండు సంవత్సరాలకి ఎన్నికలలో పోటీ చేయడమే కాకుండా అద్భుతమైన మెజారిటీని సాధించి తమిళనాడు సీఎంగా బాధ్యతలను తీసుకోబోతున్నారు.

ఎంజీఆర్, ఎన్టీఆర్ తరువాత విజయ్..

ఈ విధంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో రాజకీయాలలోకి వెళ్లి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం అనేది అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి మహానుభావులకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు వారి తరహాలోనే విజయ్ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక విజయ్ మంచి సక్సెస్ అందుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈయనకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. నేపథ్యంలోనే నటి శ్రేయ చరణ్(shriya saran) కూడా విజయ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు.

45 డిగ్రీల వేడిలో కూడా ..

ఇకపోతే తమిళ నాడు ఎన్నికలలో విజయ్ మంచి విజయాన్ని అందుకోవడంలో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో విజయ్ తో కలిసి ఈమె నటించిన సినిమాల షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంటూ.. వేసవిలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 45 డిగ్రీల వేడి ఉన్నప్పటికీ కూడా విజయ్ చాలా ఓపికగా అభిమానులతో కలిసి ఫోటోలు దిగేవారు. అభిమానులపై ఎప్పుడు చిరాకు పడలేదని చాలా ఓపికగా వారికి సెల్ఫీలు ఇచ్చే వారిని తెలిపారు. ప్రజలపై విజయ్ కు ఉన్న ఆ ప్రేమే నేడు ఆయనని గెలిపించింది అంటూ శ్రేయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అళగియ తమిళ్ మగన్…

ఇక శ్రేయ విజయ్ హీరో హీరోయిన్లుగా “అళగియ తమిళ్ మగన్” అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో “మహారాజా” అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2007 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భరతన్ దర్శకుడిగా వ్యవహరించారు. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక శ్రేయ విషయానికి వస్తే ఒకానొక సమయంలో తెలుగు, తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి యువ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live