Revenge Thriller OTT : ఓటీటీలలో రివేంజ్ థ్రిల్లర్ మూవీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇందులో ఉండే అన్యాయానికి గురైన వాళ్ళు ప్రతీకారం తీర్చుకునే విధానం, గ్రిప్పింగ్ స్టోరీ వంటి అంశాలు స్కీన్ నుంచి కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వవు.
మీరు కూడా ఈ వీకెండ్ ఇలాంటి ఓ మంచి రివేంజ్ థ్రిల్లర్ ను చూడాలి అనుకుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.
రెండు ఓటీటీలలో అందుబాటులో
ఈరోజు మనం చెప్పుకుంటున్న సిరీస్ పేరు Gangs of London (2020). ఇందులో గూస్-బంప్స్ తెప్పించే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, గ్రిప్పింగ్ ఫ్యామిలీ డ్రామా ఉంటాయి. లండన్ అండర్‌గ్రౌండ్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ‘ది రైడ్’ (The Raid) చిత్ర దర్శకుడు గారెత్ ఎవాన్స్ దీన్ని క్రియేట్ చేయడం విశేషం. లండన్ నగరాన్ని శాసించే వివిధ అంతర్జాతీయ గ్యాంగుల మధ్య జరిగే ఫైట్ ను ఇందులో చూడొచ్చు. పగ, ప్రతీకారాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ప్రస్తుతం Lionsgate Play, Amazon Prime Video రెండు ఓటీటీలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు. ఇందులో ఉండే యాక్షన్ బ్లాక్స్, ముఖ్యంగా పబ్ ఫైట్ సీన్, అపార్ట్‌మెంట్ ఇన్వేషన్ సీన్ హైలెట్ గా ఉంటాయి. అవి వెబ్ సిరీస్ చరిత్రలోనే బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్లుగా నిలవడం విశేషం. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇదొక మైండ్-బ్లోయింగ్ విందు అని చెప్పొచ్చు.
కథలోకి వెళ్తే…
లండన్ క్రైమ్ శాసిస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ డాన్ ఫిన్ వాలెస్. ఈ సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లుగా ఏలుతున్న ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఆశ్చర్యకరంగా ఇద్దరు చిన్న దొంగల చేతిలో హత్యకు గురవుతాడు. అతను చావడంతో అతని కొడుకు సాల్ వాలెస్ (జో కోల్) లండన్ గ్యాంగ్స్ బాధ్యతలను తలకెత్తుకుంటాడు. తన తండ్రిని చంపింది ఎవరో అతను తెలుసుకోవాలి అనుకుంటాడు. అప్పటి వరకూ లండన్ లోని ఏ గ్యాంగ్ కూడా ఎటువంటి బిజినెస్ చేయకూడదని ఆర్డర్ వేస్తాడు సాల్. అందులో అల్బేనియన్ మాఫియా, కుర్దిష్ ముఠా, పాకిస్తానీ డ్రగ్ లార్డ్స్ వంటి వారంతా ఉంటారు. సాల్ వేసిన ఒక్క ఆర్డర్ వల్ల లండన్ నగరంలో గ్యాంగ్ వార్స్ మొదలవుతాయి. అంతేకాదు బిజినెస్ మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది.
Also Read : హై-ప్రొఫైల్ హత్యలకు పాల్పడే ముఠా… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్
ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. వాలెస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడు, ఫైటింగ్ స్కిల్స్‌తో సాల్ మనసు గెలుచుకున్న వ్యక్తి ఎలియట్ ఫించ్. ఇక్కడి నుంచి కథ అతని చుట్టూనే తిరుగుతుంది. నిజానికి ఎలియట్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. ఆ గ్యాంగ్ ను మట్టుబెట్టడానికే అక్కడ చేర్తాడు. ఒకవైపు సాల్ తన తండ్రి చావుకు కారణమైన వారిని వెతుకుతూ లండన్ వీధుల్లో రక్తం ఏరులై పారేలా చేస్తాడు. ఇంకోవైపు ఎలియట్ అవే గ్యాంగ్స్ మధ్యలో ఉంటూ, వాళ్ళ చావు కోసం సాక్ష్యాలను సేకరిస్తాడు. అయితే వాలెస్ చావు వెనక ఆ సామ్రాజ్యానికి ఫైనాన్స్ అందించే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, ఫిన్ వాలెస్ ప్రాణ స్నేహితుడు ఎడ్ డుమాని కుటుంబం కూడా ఉందనే విషయం బయట పడుతుంది. ఈ సీజన్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ ను ఖచ్చితంగా షాక్‌కు గురిచేస్తాయి. మరి ఇంతకీ ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

