Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తరతరాలను వెంటాడే శాపం. ఆ నగలు వేసుకున్నారో నరకానికే.

తరతరాలను వెంటాడే శాపం. ఆ నగలు వేసుకున్నారో నరకానికే.

Big TV Live 2 weeks ago

Mythology Horror Movie: నగలపై వ్యామోహం లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి ? ముఖ్యంగా వారసత్వంగా వచ్చే నగలను తాకవద్దు అంటే… కానీ వాటిని తాకితే శాపం చుట్టుకుంటుంది అంటే… వినడానికి వింతగా ఉన్న ఇలాంటి స్టోరీతో రూపొంది, తాజాగా ఓటీటీలో సందడి చేస్తున్న మూవీనే ఈరోజు మన మూవీ సజేశాం.

జియో హాట్‌స్టార్‌లో నిన్నటి నుంచి నేరుగా స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘తవ్వై’ (Tavvai). ‘కాంతార’, ‘విరూపాక్ష’, ‘ముంజ్యా’ వంటి సినిమాల సక్సెస్ తర్వాత ఈ తరహా కంటెంట్‌ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పురాణాలు, శాపం, దేవుడు vs దుష్టశక్తి మధ్య జరిగే పోరాటం అన్నీ కలిపి ఈ చిత్రం ఉత్కంఠను పెంచుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1800ల కాలంలో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ కథ. ఒక పాలకుడి క్రూరత్వం, దురాశ వల్ల పుట్టిన భయంకరమైన శాపంతో ప్రారంభమవుతుంది. ఆ పాలకుడు తన స్వార్థం కోసం ఒక శక్తివంతమైన దేవతను అవమానించి, ఆమెను చంపేస్తాడు. మరణించే ముందు ఆ దేవత ఒక భయంకరమైన శాపం ఇస్తుంది. “నా రక్తం నీ వంశాన్ని తరతరాలు వేధిస్తుంది” అనేది ఆమె శాపం.ఆ శాపం కాలంతో పాటు కరిగిపోకుండా, ఒక కుటుంబాన్ని తరతరాలుగా వేధిస్తుంది.

ఆ కుటుంబ వారసులు ఎవరైనా సరే ఆ శాపం ప్రభావానికి గురవ్వాల్సిందే. ఆ శాపం వారసత్వంగా వచ్చిన ప్రాచీన నగలలో దాగి ఉంటుంది. ఆ నగలు ఎవరైనా వేసుకుంటే దుష్ట శక్తులు వారిని వేధించడం మొదలు పెడతాయి. ఇక్కడి నుంచే కథలో వింత సంఘటనలు, భయంకరమైన కలలు, అతీత శక్తుల కదలికలు… అన్నీ జరుగుతాయి. ప్రస్తుత కాలంలో ఈ శాపం ప్రమేంద్ర (భూషణ్ ప్రధాన్) మీద పడుతుంది. అతను ఆ నగలను వేసుకున్న తర్వాత తన చుట్టూ జరుగుతున్న అతీత శక్తుల కదలికలు, వింత సంఘటనలు చూసి భయపడతాడు.

తన కుటుంబాన్ని ఈ శాపం నుంచి రక్షించుకోవాడానికి ఒక దారి కోసం అతను వెతుకుతాడు. ఈ ప్రయాణంలో ఆయనకు తన కుటుంబ చరిత్ర, పూర్వీకుల రహస్యాలు, దేవుడు vs దుష్టశక్తి మధ్య జరిగిన పోరాటాలు తెలుస్తాయి. మిస్టరీ, సస్పెన్స్, హారర్ అంశాలు కలిపి సాగే ఈ కథ చివరి దశలో భారీ ట్విస్టులతో ముగుస్తుంది. శాపం వెనుక ఉన్న నిజం ఏంటి ? అసలు ప్రమేంద్ర గతం ఏంటి? ఆ కుటుంబం దాచిన రహస్యాలు ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. మైథలాజికల్ హారర్ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే ఏ సినిమా భయం, సస్పెన్స్, ఎమోషన్ కలయికతో బాగుంటుంది.

భూషణ్ ప్రధాన్, మనోజ్ జోషి, తృప్తి సాహు తదితరులు ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించారు. నీతూ పాండే, అర్పిత రంకా వంటి నటీనటులు సపోర్టింగ్ రోల్స్ పోషించారు. తవ్వై (Tavvai) ప్రస్తుతం JioHotstarలో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ హిందీ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అందుబాటులో లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live