Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తత్కాల్ టిక్కెట్స్ బుకింగ్ లో స్కామ్ నిజమేనా? ఇదీ అసలు కథ!

తత్కాల్ టిక్కెట్స్ బుకింగ్ లో స్కామ్ నిజమేనా? ఇదీ అసలు కథ!

Big TV Live 1 week ago

IRCTC Tatkal Booking Tips:భారతీయ రైల్వేలో తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది ఓ పెద్ద సవాల్‌ లా అనిపిస్తుంది. అదనంగా తత్కాల్ ఛార్జీలు చెల్లించినా కూడా చాలా మందికి కన్ఫర్మ్ టికెట్లు దొరకవు.

అయితే,తత్కాల్ బుకింగ్ అనేది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడే వ్యవస్థ కాదు. ముందస్తు ప్రణాళిక, సరైన పద్ధతులు పాటిస్తే కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే..

రైల్వే వాలెట్ ద్వారా డబ్బులు చెల్లించండి!

తత్కాల్ బుకింగ్‌ లో సీట్లు చాలా తక్కువగా ఉంటాయి. వాటి కోసం లక్షల మంది ఒకేసారి ప్రయత్నిస్తారు. ఏసీ తరగతుల తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత ఒకటి రెండు నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ బుక్ అవుతాయి. బుకింగ్ సమయంలో ఎక్కువ సమయం డబ్బుల చెల్లింపులోనే వృథా అవుతుంది. UPI, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లు రద్దీ సమయంలో నెమ్మదిగా పనిచేయడం, ఫెయిలవ్వడం జరుగుతుంది. అందుకే, ముందుగానే IRCTC e-Wallet, R-Walletలో డబ్బు జమ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే చెల్లింపు ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.

ప్రయాణికుల వివరాలు ముందుగానే సేవ్ చేయండి!

తత్కాల్ టికెట్ బుక్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణికుల వివరాలను ముందుగానే IRCTC మాస్టర్ లిస్టులో సేవ్ చేసుకోవాలి. రైలు వివరాలను ముందుగానే ఎంపిక చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. బుకింగ్ ప్రారంభమైన తర్వాత వెతకడం మొదలుపెడితే టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగే మొబైల్ యాప్, వెబ్‌ సైట్ రెండింటినీ ఉపయోగించి ప్రయత్నించడం కొందరికి ఉపయోగపడుతుంది. ఒక పద్ధతి పనిచేయకపోతే మరొకటి ద్వారా త్వరగా బుకింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

ప్రీమియం తత్కాల్ ట్రై చేయండి!

తత్కాల్ టికెట్ దొరకకపోతే ప్రీమియం తత్కాల్ ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇందులో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న సీట్లు సాధారణంగా కన్ఫర్మ్‌ గా ఇవ్వబడతాయి. అయితే, రద్దు చేస్తే డబ్బు తిరిగి రాకపోవచ్చు.

రైల్వేలో ప్రత్యేక టిక్కెట్ కోటాలు

చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే, రైల్వేల్లో కొన్ని ప్రత్యేక కోటాలు కూడా ఉంటాయి. మహిళల కోటా, పర్యాటక కోటా, అత్యవసర కోటా వంటి సీట్లు కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండొచ్చు. వీటి గురించి స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లలో సమాచారం తీసుకోవచ్చు.

వెయిటింగ్ లిస్ట్ గురించి..

వెయిటింగ్ లిస్ట్ విషయంలో కూడా ప్రయాణికులు అవగాహన అవసరం. సాధారణంగా WL 1 నుంచి WL 6 వరకు ఉన్న టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. WL 7 నుంచి WL 15 వరకు కాస్త తక్కువగా ఉంటాయి. WL 30 దాటితే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అటు GNWL, PQWL, RLWL లాంటి వెయిటింగ్ లిస్ట్ రకాలలో GNWL సాధారణంగా ఎక్కువగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. బుకింగ్ సమయంలో ఈ వివరాలను కూడా పరిశీలించడం మంచిది.

Read Also: కన్ఫర్మ్ టిక్కెట్ ఉన్నా నో సీట్.. రైల్వేకు దిమ్మతిరిగే షాకిచ్చిన వినియోగదారుల కమిషన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live