Sand Mining: స్వేచ్ఛ బ్యూరో: మహారాష్ట్ర మాఫియా చేతిలో తెలంగాణ బంగారం లాంటి ఇసుక అక్రమ రావనకు దారి తీస్తుంది. తెలంగాణ మహారాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య మంజీర, బొలేగవ్ నది సరిహద్దు వివాదం ముదురుతుంది.
నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలు మరాఠా మాఫియా ఇసుక దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నది సరిహద్దు విషయం లో హద్దులు నిర్ణయించి ఉన్నప్పటికీ మహారాష్ట్ర ఇసుక వ్యాపారులు అతిక్రమిస్తున్నారని మండి పడుతున్నారు. తెలంగాణ నది భూభాగం పరీదిలో విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరపటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ భూభాగంలో ఇసుక తవ్వకాలు
అంతర్రాష్ట్ర ఒప్పందాలను అతిక్రమించి మంజీర నదిలో ఇసుక నిల్వలను కొందరు వ్యక్తులు కొల్లగొడుతున్నారు. మహారాష్ట్రలో ఇసుక క్వారీలు దక్కించుకున్న నిర్వాహకులు తెలంగాణ మహారాష్ట్ర మధ్యన ఉన్న మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో ఇసుక తవ్వకాలు చేస్తూ.. మహారాష్ట్ర ఖజానాను నింపుతున్నారు. నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోలేగాం, ఏన్గ, గంజ్గాం గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇసుక క్వారీలను దక్కించుకున్న వారు మహారాష్ట్ర భూభాగంలో ఇసుక తవ్వకాలు చేపడుతూ నెమ్మదిగా తెలంగాణ వైపునకు చొచ్చుకొచ్చి ఇసుకను కొల్లగొట్టడం పరిపాటిగా మారింది.
హద్దు రాళ్లు పాతినా..
మహారాష్ట్ర సర్కారు అక్కడి మంజీర నది భూభాగంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినప్పటికీ తవ్వకాలు మాత్రం తెలంగాణ భూభాగంలో జరుగుతున్నాయి. సాలూర మండలం తగ్గెల్లి అవతలి వైపునున్న గంజ్ గాం ఇసుక క్వారీ నిర్వాహకులు రాష్ట్రco హద్దులో తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో దీంతో రెవెన్యూ యంత్రాంగం నదిలో హద్దులు గుర్తించి రాళ్లు పాతారు. కొద్దిరోజుల తర్వాత వాటిని తొలగించి మళ్లీ తవ్వకాలు చేస్తున్నరు..పగలంతా మహారాష్ట్ర భూభాగంలో.. రాత్రి తెలంగాణ భూభాగంలో తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా సాలూర మండలం హున్సాకు అవతలి వైపునున్న బోలేగాం క్వారీ నిర్వాహకులు రాష్ట్ర భూభాగంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించిన రైతులు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Also read: లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?
గత కొన్ని రోజులుగా..
సాలూర తహసీల్దార్ అజ్మిత్ నవాజ్, సర్వేయర్ ఆనంద్, బోధన్ రూరల్ పోలీసులు తమ సిబ్బందితో నదిలోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అభ్యంతరం తెలిపారు. క్వారీ అనుమతి పత్రాలను చూపాలని నిర్వాహకులను కోరాగా.. వారు నిరాకరించారు . నదిలో సంయుక్త సర్వే చేపడతామని, అప్పటి వరకు తమ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టవద్దని అధికారులు స్పష్టం చేశారు అప్పటి నుండి రాత్రి వేలల్లో తవ్వకాలు చేపడుతున్నారు..పగలు వారి భూభాగంలో కొనసాగిస్తున్నారు.. గత కొన్ని రోజులుగా మంజీరా సరిహద్దు గ్రామాలైన హన్సా,తగ్గేలి ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.
సరిహద్దు వివాదం
బోధన్ నియోజక వర్గంలోని సాలురా మండలం గ్రామాలు మంజీరా సరిహద్దులో ఉంటాయి..నదికి ఇవతలి వైపు తెలంగాణ రాష్ట్ర,అటు వైపు మహారాష్ట్ర గ్రామాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చి దాడులు ఘర్షణల వరకు వెళ్ళింది..అపుడు కూడా ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు కానీ ఇపుడు మళ్లీ తరుచూ హద్దులను ధ్వంసం చేస్తూ మన రాష్ట్రంలోని నది ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు..దీంతో ఇక్కడి సరిహద్దు గ్రామాల్లో బుగర్బ జలాలు అడుగంటుతున్నాయని బోర్లు వట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. ఇక దీనిపై సమగ్ర సర్వే చేసి హద్దులు పెట్టాలని సూచించారు.
తెలంగాణ సరిహద్దు గ్రామాల రైతులు..
మజీరా నదిలో నీటి ప్రవాహం ఆగిపోయిన ప్రతి సారి వేసవి కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీలు దక్కించుకుని తెలంగాణ భూ భాగంలో చొరబడుతున్నారు ఎక్కడో వ్యాపారులు..వారికి మహారాష్ట్ర అధికారులు సైతం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి..జాయింట్ సర్వే నిర్వహిద్దామని తెలంగాణ అధికారులు కోరినా మహారాష్ట్ర అధికారులు ప్రతి సారి దాటవేస్తున్నారు..ఇప్పటికైనా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సి అవసరం ఉంది..లేకపోతే బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం తరహాలో ఈ సరిహద్దు వివాదం ముదిరే అవకాశం కనిపిస్తుంది.
సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

