Congress Unity: పిఎసి సమావేశంలో తెంగాణ నూతన కాంగ్రెస్ ఇంచార్జ్ బి.ఎం సందీప్ కుమార్ మాట్లాడారు. తెలంగాణలో అంత కలిసికట్టుగా పని చేయడం వల్ల గత ఎన్నికల్లో మనం రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగామని అన్నారు.
గతంలో మనం ఐకమత్యంగా పని చేయడం వల్ల 64 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చాము. తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, అధికారంలోకి వచ్చిన మనం ఇక్కడ అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు.
సర్ పై కాంగ్రెస్ యుద్దం..
దేశంలో ఎల్ నినో వల్ల తీవ్రమైన కరవు ఏర్పడింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదు వారు సహాయ నిరాకరణ చేసినా కూడా మనం కరువును ఎదుర్కొంటు రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నామని సందీప్ కుమర్ అన్నారు. ఇప్పుడు మనం మరింత ఉత్సహంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో మరిన్ని అధిక స్థానాలు సంపాదించాలని, సర్ పై కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ భావజాలం..
గతంలో ఇక్కడ పని చేసిన ఏఐసీసీ ఇంచార్జ్‌లు పార్టీని బలోపేతం చేయడంలో చాలా కృషి చేసారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి మనం పని చేయాలని పిలుపు నిచ్చారు. సోనియాగాంధీ రాసిన బిలాంగింగ్ పుస్తకం దేశంలో చాలా ప్రాధాన్యత వచ్చింది. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గార్ల బలిదానాలు ఈ దేశంలో ప్రజల మనసులో ఉన్నాయి. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలని మనం అంత కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి వచ్చే విదంగా కృషి చేయాలని బిఎం సందీప్ కుమార్ పిలుపునిచ్చారు.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

