Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ రెరా కీలక నిర్ణయం.. రియల్‌ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట!

తెలంగాణ రెరా కీలక నిర్ణయం.. రియల్‌ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట!

Big TV Live 2 weeks ago

TG RERA Extends: పశ్చిమ ఆసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, దానికి తోడు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక రంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

మన దగ్గర కూడా దీని ప్రభావం పడటంతో, నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. బిల్డర్లకు, డెవలపర్లకు కొంత రిలీఫ్ ఇస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

గడువు పొడిగింపు.. ఎవరికి వర్తిస్తుంది?

రాష్ట్రంలో రెరా పరిధిలో నమోదైన ప్రాజెక్టుల పూర్తి గడువును ఉమ్మడిగా నాలుగు నెలల పాటు పొడిగిస్తున్నట్లు టీజీ రెరా ప్రకటించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28, 2026 నాటికి కానీ, ఆ తర్వాత కానీ పూర్తి కావాల్సిన ప్రతీ రెరా నమోదిత ప్రాజెక్టుకు ఈ నాలుగు నెలల అదనపు గడువు వర్తిస్తుందని అథారిటీ స్పష్టం చేసింది. దీనివల్ల గడువు ముగింపు దశలో ఉండి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేక ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రమోటర్లకు భారీ ఊరట లభించినట్లయింది.

నిర్ణయానికి కారణాలేంటి?

యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా రవాణా వ్యవస్థ, సరుకుల సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన స్టీలు, సిమెంట్, ఇతర ముడి సరుకుల లభ్యత తగ్గడమే కాకుండా రవాణా ఛార్జీలు పెరగడం, దిగుమతుల్లో జాప్యం జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టమని గ్రహించిన టీజీ రెరా, ప్రాజెక్టుల అమల్లో జాప్యాన్ని ముందే ఊహించి ఈ సమయోచిత నిర్ణయం తీసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live