Health Transfers: స్వేచ్ఛ బ్యూరో: వైద్యారోగ్యశాఖలోని ట్రాన్స్ ఫర్స్ ప్రాసెస్ ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా వైద్యారోగ్యశాఖలో ట్రాన్స్ ఫర్స్ చేయలేని సిచ్వేషన్ ఉన్నది.
అత్యవసర శాఖ కావడంతో ఈ విభాగానికి ప్రత్యేక రూల్స్ అవసరమని ఆఫీసర్లు భావిస్తున్నారు.ఇందుకోసం ప్రభుత్వానికి కూడా ప్రత్యేక లేఖ రాశారు. వైద్యారోగ్యశాఖలోని ట్రాన్స్ ఫర్స్ ను ఎలా చేయాలి? ప్రయారిటీలు ఏమిటీ? ఉద్యోగులను ఏ ప్రాతిపాదికన ఎంపిక చేయాలి? వంటి అంశాలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
ఆన్ లైన్ లోనే..
ఆన్ లైన్ లోనే చేయాలని భావిస్తున్న వైద్యారోగ్యశాఖ.. ట్రాన్స్ ఫర్స్ జాబితా సెలక్ట్ చేసే విధానంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరింది. సీనియారిటీ, సౌజ్, మెడికల్ కేసుల కన్సిడర్ లపై మరింత క్లారిటీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేగాక సూపర్ స్పెషాలిటీ సీట్లు, కీలకమైన విభాగాలకు డాక్టర్ల బదిలీల్లోనూ ఓ స్పష్టత ఇవ్వాలని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ హెల్త్ సెక్రటరికీ లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగుతామని అధికారులు చెప్తున్నారు.
లాంగ్ స్టాండింగ్ కు చెక్ పెట్టాలి..?
జనరల్ ట్రాన్స్ ఫర్స్ చేసే కంటే ముందే లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లను తప్పనిసరిగా జాబితా సేకరించాలని డాక్టర్స్ యూనియన్ పేర్కొంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లో పాతుకుపోయిన ఆఫీసర్లను వెంటనే బదిలీల్లో పంపాలని యూనియన్లు కోరుతున్నాయి. ఓ డీఎమ్ హెచ్ వో ఏకంగా ఒకే స్థానంలో ఏడున్నర ఏళ్ల పాటు ఉన్నారంటూ యూనియన్ నాయకులు చెబుతున్నారు. అంతేగాక చాలా మంది డాక్టర్లు కూడా ఇదే విధానంలో పాతుకుపోయారని వివరిస్తున్నారు. డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్..ఇలా అన్ని కేడర్లలోని లాంగ్ స్టాండింగ్ ను తొలగించాలని యూనియన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
Also read: సినిమా స్క్రిప్ట్‌ను మించిన పాస్టర్ 'దాడి' డ్రామా.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
డీజీడీఏ నుంచి 186 మంది మాత్రమే..
జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫీసస్ బేరర్స్ హోదాలో కేవలం 186 మంది కి మినహాయింపు కలుగుతుందని ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి, జనరల్ సెక్రటరీ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, ట్రెజరర్ డాక్టర్ రవూప్ లు తెలిపారు. ఇందులో డీఎంఈ నుంచి 88 మంది, టీవీవీపీ నుంచి 65, డీపీహెచ్ నుంచి 33 మంది ఉండగా, జీహెచ్ ఎంసీ పరిధిలో 63 మంది ఉన్నట్లు వివరించారు. మిగతా 123 మంది అన్ని జిల్లాల్లోనే వర్క్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
జీవో 34 ప్రకారం..
మరోవైపుమహిళలు, శిశువులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో 34 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రోటేషనల్ ట్రాన్స్‌ఫర్ పాలసీ నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టంచేశారు. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన ఉద్యోగులు,మేధో వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులు ,70 శాతం లేదా అంతకంటే ఎక్కువ నిర్దిష్ట దివ్యాంగత్వం కలిగిన బంధువులకు సంరక్షకులుగా వ్యవహరిస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీల్లో నుంచి మినహాయింపు ఇవ్వాలని డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ కోరారు.

