Telangana SSC 2026: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి (SSC-2026) ఫలితాల వేళ భాగ్యనగరం మరోసారి విద్యా రంగంలో తన సత్తా చాటింది. ముఖ్యంగా భాష్యం విద్యాసంస్థలు రికార్డు స్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించాయి.
బుధవారం ఎస్.ఆర్. నగర్‌లోని భాష్యం క్యాంపస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తమ విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలను చూసి యాజమాన్యం, ఉపాధ్యాయులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఈ విజయం కేవలం అంకెల్లో కాకుండా, విద్యార్థుల కఠోర శ్రమకు, భాష్యం విద్యా విధానానికి నిదర్శనమని మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ కొనియాడారు.
మార్కుల వర్షం.. మెరిసిన ఆణిముత్యాలు!
ఈ ఏడాది ఫలితాల్లో పి.శృతి, ఆర్.గుణసాయి శరణ్ రెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు 600కి గాను 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో భాష్యం కీర్తిని దశదిశలా చాటారు. వీరితో పాటు వి.ఎస్.ఎన్.శరజ్ఞ, కె.ఎల్.డి.వి. అనూరాధ, కె.హనీషా (594 మార్కులు), డి.గగన హంస, యు.వి.లిఖిత్, ఆరోహి శర్మ (593 మార్కులు) వంటి మేధావులు అత్యుత్తమ స్కోరుతో దూసుకుపోయారు. ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 203 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. ప్రతి సబ్జెక్టులోనూ విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
గణితం, సైన్స్‌లో ‘భాష్యం’ హవా.. సగటు స్కోరులో టాప్!
సాధారణంగా విద్యార్థులు కష్టంగా భావించే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో భాష్యం విద్యార్థులు అద్భుతాలు చేశారు. దాదాపు 1500 మంది విద్యార్థులు మ్యాథ్స్‌లో 90కి పైగా మార్కులు సాధించగా, 1331 మంది సైన్స్‌లో అదే స్థాయిలో రాణించారు. సంస్థ మొత్తం మీద సగటున 520 మార్కుల యావరేజ్ స్కోరు సాధించి, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో తమకు సాటిలేరని నిరూపించుకుంది. 1934 మంది విద్యార్థులు 500 మార్కుల క్లబ్‌లో చేరడం భాష్యం అకడమిక్ ప్లానింగ్‌కు నిలువుటద్దంలా నిలిచింది.
సమగ్ర ప్రణాళికే విజయ రహస్యం..
ఈ సందర్భంగా సాకేత్ రామ్ మాట్లాడుతూ.. “విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, సమగ్ర విద్యా ప్రణాళికలతో ముందుకు సాగడమే భాష్యం జైత్రయాత్రకు అసలైన బలం” అని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, హైదరాబాద్ సీఈఓ చైతన్యలు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
సందడిగా వేడుకలు.. భాష్యం ప్రస్థానం అప్రతిహతం!
ఎస్.ఆర్. నగర్ క్యాంపస్‌లో జరిగిన ఈ అభినందన సభలో జోనల్ హెడ్స్ బి.అంకమ్మరావు, శిరీష, మార్కండేయులు సహా అధ్యాపక బృందం ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలైన విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అత్యుత్తమ ర్యాంకులు, గరిష్ట మార్కులతో ప్రతి ఏటా సరికొత్త రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా భాష్యం విద్యాసంస్థలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాయని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశాయి.
ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్.. 90 నిమిషాల సుదీర్ఘ చర్చలు.. అసలు ఏం మాట్లాడుకున్నారంటే?

