Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big TV Live 1 week ago

Telangana Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియా వేదికగా ప్రజలకు భావోద్వేగ పూరిత సందేశాన్ని ఇచ్చారు.

ప్రజా ఆకాంక్షలు, అమరుల త్యాగాల ఆశయాలు ఇంధనంగా వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం కొనసాగిందని రాసుకొచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన

తెలంగాణలో జన ఆకాంక్షలే కేంద్రంగా.. త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ప్రత్యేకంగా రాసుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పేదల అవసరాలను వారి ఆత్మగౌరవాలను మేళవించి సంక్షేమం అమలు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దీర్ఘకాలిక భవితను, యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎక్స్‌లో పోస్టు

సకల వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ 1000 రోజుల పాలన ప్రయాణం సాగినట్టు రాసుకొచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అండతో తెలంగాణను విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు ఈ కృషిని అవిశ్రాంతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ప్రయాణంలో తనకు తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీతో ఈ అనుబంధం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి.

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live