Telangana EAPCET Result 2026: తెలంగాణలో ఇంజినీరింగ్-అగ్రికల్చర్-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆయా ఫలితాలను విడుదల చేశారు.
ఇంజినీరింగ్ విభాగంలో తొలి రెండు ర్యాంకులు హైదరాబాద్ సిటీకి రాగా, మూడు, నాలుగో ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు.
తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు-2026
తెలంగాణలో ఇంజినీరింగ్-అగ్రికల్చర్-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల పరీక్ష ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు విడుదల చేశారు. ఆదివారం జేఎన్‌టీయూలో ఏర్పాటు ఆయా ఫలితాలు విడుదలయ్యాయి. ఇక విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్ ద్వారా తమకు ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్-అగ్రికల్చరల్-ఫార్మసీ విభాగాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష మే నాలుగున జరిగింది.
ఇంజనీరింగ్ కు 1,97,241 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష రాసిన 84,954 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో దాదాపు 73.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో నగరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించారు.
టాపర్స్ వీళ్లే.. కేవలం వారం రోజుల్లో
ఋషి-ఉప్పల్, అన్షుల్- మూసాపేటకి విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఏపీ నుంచి వంశీధర్‌రెడ్డి-పులివెందులకు చెందిన విద్యార్థి మూడో ర్యాంక్ రాగా, రోషన్ మణిదీప్‌రెడ్డి-గుంటూరుకి చెందిన విద్యార్థికి నాలుగో ర్యాంక్ వచ్చింది.మహబూబ్‌నగర్‌కి చెందిన సాయినిఖిత్‌కు ఐదో ర్యాంక్ వచ్చింది. సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ర్యాంకులు చూసుకోవచ్చు.
అగ్రికల్చర్ -ఫార్మసీ విభాగాల్లో తొలి ఐదు ర్యాంకులు తెలంగాణకు దక్కాయి. అహ్మద్-ఆసిఫ్ నగర్, నివృత్త్ సాయి వెంకట్- ఎర్రమంజిల్, సాహితి గీతిక గుంతి-రంగారెడ్డి జిల్లా, జయసింహ-బాగ్ అంబర్‌పేట్, అమైర్ అనాస్-హుమాయూన్ నగర్ ప్రాంతాలకు వాసులకు దక్కాయి.
ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు
ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుల ఆధారంగా మంచి కళాశాలల్లో ప్రవేశాలకు రెడీ అవుతున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపుపై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు అధికారులు.

