Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

Big TV Live 1 week ago

CMR Audit: సీఎంఆర్ వ్యవస్థపై గత 10-12 ఏళ్ల కార్యకలాపాలకు సమగ్ర ఆడిట్‌ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి, ప్రతి గింజను రికవరీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్సష్టం చేశారు.

రాష్ట్రంలో జిల్లాల వారీగా, మిల్లర్ల వారీగా పెండింగ్ బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలపై సమీక్షించాలిని మంత్రి ఉత్తం స్పష్టం చేశారు.

క్రిమినల్ కేసులులు నమోదు..

తెలంగాణలో ప్రభుత్వం ధాన్యం దారి మళ్లింప మరియు, ఒప్పంద ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులులు నమోదు చేయాలని, బ్లాక్‌లిస్టింగ్ సహా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సీఎంఆర్ విధానంలో సంస్కరణలు - కఠిన ఒప్పందాలు, బలమైన బ్యాంక్ గ్యారంటీలు, డిఫాల్ట్‌లపై కఠిన శిక్షలు అమలు చేయాలని మంత్రి తెలిపారు.

వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

ఆదేశాలు జారీ..

రాష్ట్రంలో ఉన్న క్యూఆర్ కోడ్ గన్నీ బ్యాగులు, జీపీఎస్ ట్రాకింగ్, జియో ట్యాగింగ్, రియల్‌టైమ్ స్టాక్ మానిటరింగ్‌తో సాంకేతికపై నిరంతరవ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎంఎస్‌పీపై ధాన్యం కొనుగోలు, సకాలంలో చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే రైస్ మిల్లర్లకు పూర్తి రక్షణ ఉంటుందని, ప్రభుత్వ ధాన్యం దారి మళ్లించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live