Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు, రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు

తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు, రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు

Big TV Live 19 hrs ago

Weather Updates: రెండు రోజులుగా భానుడి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వాన కబురు మోసుకొచ్చింది. ఏపీ, తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడినట్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో రుతుపవనాలు బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరించినట్లు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు

రుతుపవనాల కదలికల ప్రభావంతో ఏపీ-తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కేరళ, కర్ణాటక, అండమాన్ -నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒడిశా, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.

రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు-ఐఎండీ

రానున్న మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తాయని పేర్కొంది. తూర్పు-మధ్య బంగాళాఖాతం అంటే.. తీర ప్రాంత ఏపీ వైపు వస్తాయని చెప్పింది. తాజా అంచనాల నేపథ్యంలో మే 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని చెప్పకనే చెప్పింది.

నైరుతి రుతుపవనాల వల్ల వర్ష సూచన ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడి తాపం కొనసాగనుందని అంచనా వేసింది. ఉత్తర తెలంగాణలో రాబోయే 3 రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆయా జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.

చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి.. ఎంపీ అరవింద్‌పై సంజయ్ ఫైర్!

ఈశాన్య-దక్షిణ రాష్ట్రాలు భారీ వర్షాలకు సిద్ధమవుతున్నప్పటికీ ఉత్తర-మధ్య భారతంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల వీస్తాయని ప్రస్తావించింది. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ వారం వడగాలుల వీచే అవకాశముందని తెలియజేసింది. మే 19 నుంచి 23 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీయనున్నట్లు ఐఎమ్‌డి హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live