Student Development: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక శారీరక సామర్ధ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కె.
హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రక్రియలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 10 థీమ్ ల తోటి వారానికి ఒక్కో ప్రత్యేకమైన థీమ్ తో వారం మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తుందనీ అలాగే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సభలను నిర్వహించడం జరుగుతుందని వీటి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్లి వారికి తెలియజేయడం. ఈ వారం విద్యా వారోత్సవాలు భాగంగా విద్య విజయోత్సవం కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఫలితాలు ఎలా వచ్చినా పర్లేదు బాగా చదివించండి కానీ పరీక్షల్లో కాఫీ మాత్రం కొట్టకూడదు. ఉన్నతమైన విలువలు అనేది విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాలనీ తెలిపారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్‌ల జోరు.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లు కూడా వచ్చేస్తున్నాయ్!
బేసిక్ ఫౌండేషన్ స్కూల్..
పుట్టగానే పిల్లలు తల్లిదండ్రులను, పాఠశాలలో టీచర్లను అనుసరిస్తారు. తల్లిదండ్రులగా టీచర్లు కూడా విద్యార్థులకు ఆదర్శంగా పిల్లల పక్కన నిలబడాలని సూచించారు. సమాజం అనేది ఎక్కడో ఉండదు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలంటే బేసిక్ ఫౌండేషన్ స్కూల్ స్టడీ మాత్రమే అని తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు ధైర్యంగా ఉండడం, రకరకాల కొత్త నైపుణ్యాలను నేర్పడం, కష్టం వస్తె ఎలా తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యాన్ని, శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలో ప్రతిది పాఠశాల నేర్పిస్తుంది. పదవ తరగతిలో 97% ఫలితాలు వచ్చాయంటే దాని వెనుక విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని వారిని అభినందించారు. చదువు పదవ తరగతి వరకు సాగినట్లు ఇంటర్ లో ఉండదు, ఇంటర్ లో మీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఆధారంగా నచ్చిన రంగంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. మీరు ఏదైతే నమ్ముతారో, ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరినైతే ఆరాధిస్తారో, వాటిని బట్టే మీకు సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.
ఉదయం బ్రేక్ఫాస్ట్ పథకం..
చదువు తో పాటు ఆటలు, యోగ, కల్చరల్ ఆక్టివిటీస్ లాంటివి నేర్పించాలని వాటి ద్వారా వ్యక్తిగతంగా దృఢంగా ఉండడంతో పాటు నాయకత్వ లక్షణాలతో కూడిన సామర్థ్యాలు విద్యార్థులకు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం తో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ పథకం కూడా అమలు చేయబోతుందని అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైతం మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నట్టు తెలిపారు. అనంతరం పదో తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పదివేల రూపాయల చెక్కు ను మరియు క్రీడలు లో ప్రతిభ కనబరిచిన పలువురికి విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వచ్చేవారం 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించబోయే యువత- క్రీడల ప్రోత్సాహం సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ లు, విద్యాశాఖ అధికారులు, పలు పాఠశాల ప్రిన్సిపల్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కంచికి చేరిందనుకున్న ఐ బోమ్మ కథ మళ్లీ మొదటికే.. కేసు ఫైల్ చేసిన పోలీసులు!

