Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిపడేసిన తిలక్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజయం

టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిపడేసిన తిలక్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజయం

Big TV Live 11 hrs ago

India vs Zimbabwe 2nd T20: టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( Team India vs. Zimbabwe ) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతుల్లో చిత్తయిన టీమిండియా….

జింబాబ్వే పైన మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. ఈ క్రమంలోనే హరరే లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 లో కూడా టీమిండియా విక్టరీ అందుకుంది. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే, చిత్తయింది. దీంతో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని..2-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది.

6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్‌, టీమిండియా విజయం

ఇచ్చిపడేసిన తిలక్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజయం

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య హరారే వేదికగా రెండో టి20 జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 90 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయగా 219 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే 17.5 ఓవర్లకు 129 పరుగులు చేసి కుప్ప కూలింది. ఈ క్రమంలో టీమిండియా మరో విక్టరీ నమోదు చేసుకొని… సిరీస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా తొలి సిరీస్ గెలుచుకున్నాడు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఇరగదీసిన తిలక్ వర్మ… ఆ మిస్టరీ లేడీ కారణమా ?

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య హరారే వేదికగా రెండో టి20 జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయినప్పటికీ.. మొదటి బ్యాటింగ్ కు దిగి భారీ స్కోరు సాధించింది టీం ఇండియా. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అదిరిపోయే బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. దీంతో 20 ఓవర్లలో 219 పరుగులు సాధించింది టీమిండియా. అటు తనపై ట్రోలింగ్ చేసే వాళ్లకు బ్యాట్ తో సమాధానమిచ్చాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 60 పరుగులు సాధించాడు. 200 స్ట్రైక్ రేటుతో మూడు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు బాదాడు.

దీంతో టెస్ట్ ప్లేయర్ అన్న వాళ్లకు బ్యాట్ తో చెంప చెల్లుమనేలా అనుసరించాడు తిలక్. అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ కు కారణం ఓ మిస్టరీ లేడీ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హరారే స్టేడియానికి ఓ అందమైన అమ్మాయి వచ్చింది. ఆమె తిలక్ వర్మ ప్రియురాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సీక్రెట్ గా ఆమెతో మనోడు రిలేషన్ షిప్ పెట్టుకున్నాడని అంటున్నారు. అందుకే ఆమె రాగానే బ్యాట్ తో పరుగులు రాబట్టాడని తిలక్ వర్మపై పోస్టులు పెడుతున్నారు. అయితే అదేమీ కాదని.. ఆ అమ్మాయికి, తిలక్ వర్మ కు ఎలాంటి సంబంధం లేదని అతని ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live