This Week OTT Movies: సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అందులో ఈమధ్య చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మే నెలలో ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి మాత్రం రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్, హీరో తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం, కమెడీయన్ సత్య నటించిన జెట్లీ మూవీలు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నాయి.. ఇక ఈ నెలలో చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. మరి మే నెలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..
ఇక ఈ సమ్మర్ లో ఓటీటీ సినిమాలకు డిమాండ్ భారీగా పెరిగింది.. వేసవి సెలవులు కావడంతో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరే ఉంటూ సినిమాలన్నీ చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. దాంతో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా కొత్త సినిమాలు అన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం విడుదల అవుతున్న ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. దాదాపుగా 10 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాలా 2, ప్రియాంక చోప్రా నటించిన సీటాడేల్ సినిమాలు కాస్త ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటుగా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..
మై దియరెస్ట్ అస్ససైన్ – మే 7
మై రాయల్ నేమిసిస్ – మే 8
రీమార్కబులే బ్రెయిట్ క్రీచర్స్ – మే 8
భారతనాట్యం 2 / మోహినియాట్టం – మే 8
అమెజాన్ ప్రైమ్..
సిటాడేల్ సీజన్ 2- మే 6
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ( lik ) – మే 6
లుక్కే సీజన్ 1 – మే 8
డెకాయిట్ – మే 8
జీ 5..
ద కేరళ స్టోరీ 2 – మే 8
వీటితో పాటుగా మ్యాట్కా కింగ్, ఓ బటర్‌ఫ్లై,లాస్ట్ వన్ లాఫింగ్ జర్మనీ సీజన్ 7 లతో పాటుగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎక్కువ మంది lik, సీటాడేల్ సీజన్ 2,వాలా 2 సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఈ సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి.. మరి ఈ సినిమాలు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి… ఇక సమ్మర్ స్పెషల్ గా తీయటనలోకి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా కోసం జనాలు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు.

