Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

Big TV Live 1 month ago

Telugu Romantic Drama: ఓటీటీలో ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మనసుకు దగ్గరవుతాయి. భారీ యాక్షన్, పెద్ద ట్విస్టులు లేకపోయినా… పాత్రల ప్రయాణంతో ప్రేక్షకుడిని కట్టిపడేసే చిత్రాలు కూడా ఉంటాయి.

అలాంటి సినిమాల్లో ‘దీవానా’ (Deewana) కూడా ఒకటి. మొదట చూస్తే ఇది రొటీన్ ప్రేమకథలా అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగేకొద్దీ ప్రేమ అంటే ఒకరిని ఇష్టపడటం మాత్రమే కాదు… మనల్ని మనం మార్చుకునే శక్తి కూడా ప్రేమకే ఉంటుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. మరి థియేటర్లలో ఆడియన్స్ ను కన్నీళ్ళు పెట్టించిన ఈ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హైదరాబాద్‌లోని ఓ మధ్యతరగతి కాలనీలో మున్నా అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. డిగ్రీ పూర్తయినా ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉండదు. రోజంతా స్నేహితులతో తిరగడం, చిన్న చిన్న గొడవలు పడటం, కేఫేల్లో కాలక్షేపం చేయడమే అతని రొటీన్. తల్లిదండ్రులు ఎంత చెప్పినా అతని ప్రవర్తన మాత్రం మారదు. ఇంట్లో బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచనే ఉండనే ఉండదు.

ఒకరోజు మీసేవ కేంద్రానికి వెళ్లిన మున్నా, అక్కడ పనిచేసే అమూల్య అలియాస్ అమ్మును చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ప్రపంచంలో తనకు ఆమెకంటే మంచి అమ్మాయి మరెవరూ దొరకరని భావిస్తాడు. అప్పటి నుంచి ఏదో ఒక పని ఉందని చెప్పుకుంటూ ప్రతిరోజూ మీసేవ సెంటర్‌కు వెళ్లడం మొదలుపెడతాడు. తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. కానీ హీరోని బాధ్యత లేకుండా తిరిగే వ్యక్తిగా చూసే అమ్ము అతడిని రిజెక్ట్ చేస్తుంది.

అమూల్యను ఆకట్టుకోవడానికి మున్నా చేసే ప్రయత్నాలు కొన్ని సరదాగా సాగుతాయి. కానీ ఒక దశలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులు అతని కళ్ల ముందుకు వస్తాయి. ఆఫీసులో ఆమెను వేధించే వ్యక్తికి ఎదురు నిలవడం, ఆమె గురించి అనుచితంగా మాట్లాడిన వారితో గొడవ పడటం వంటి సంఘటనలు కథలో కీలక మలుపు తీసుకొస్తాయి.

ఆ సమయంలోనే అమూల్య మనసులో దాగి ఉన్న బాధ, ఆమె జీవితంలో ఉన్న కొన్ని కఠినమైన పరిస్థితులు మున్నాకు అర్థమవుతాయి. కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడం సరిపోదని… నిజంగా ఆమె జీవితంలో చోటు సంపాదించాలంటే ముందుగా తనను తాను మార్చుకోవాలని అతడు గ్రహిస్తాడు. అక్కడి నుంచి ‘దీవానా’ ఒక సాధారణ ప్రేమకథ నుంచి భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది.

అమూల్య అతని ముందు పెట్టిన ఒక షరతు మున్నా జీవితాన్నే మార్చేస్తుంది. కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల విలువ, జీవితంలో లక్ష్యం ఎంత ముఖ్యమో అతను ఒక్కో అడుగులో తెలుసుకుంటాడు. ప్రేమ కోసం మొదలైన ఈ ప్రయాణం చివరకు అతన్ని ఎలా మార్చింది? తన ప్రేమను గెలుచుకోవడానికి మున్నా చేసిన త్యాగాలు ఫలించాయా? చివరికి ఏమైంది ? అనే విషయాలను దర్శకుడు హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. ఆ అనుభూతిని మాత్రం తెరపై చూసి ఆస్వాదించాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

‘దీవానా’ చిత్రం 2026 జూన్ 20న థియేటర్లలో విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ప్రస్తుతం ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Ahaఓటీటీలో జూలై 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒరిజినల్ తెలుగు సినిమా కావడంతో తెలుగు భాషలోనే అందుబాటులో ఉంది. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథలు, మధ్యతరగతి కుటుంబాల అనుబంధాలు, ప్రేమ వల్ల జీవితంలో వచ్చే మార్పు వంటి అంశాలతో ఉండే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి.

కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live