Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమిండియా కోసం వాళ్ల కాళ్లు పట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచలనం !

టీమిండియా కోసం వాళ్ల కాళ్లు పట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచలనం !

Big TV Live 3 weeks ago

Tamim Iqbal Urged Bangladesh Government: బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా (Bangladesh vs. Team India) మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు కొంత మంది హిందువులను బంగ్లాదేశ్ లో హతమార్చారు.

దీంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగి.. ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దయ్యాయి. ఐపీఎల్ లో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడకుండా బ్యాన్ కూడా విధించారు. అయితే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో మళ్లీ ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడు వన్డేల తో పాటు మూడు టి20 లు ప్లాన్ చేస్తున్నాయి రెండు జట్ల క్రికెట్ బోర్డులు.

Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

టీమిండియా కోసం వాళ్ల కాళ్లు పట్టుకుంటాను..తమీమ్ సంచలనం !

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెల్లిమెల్లిగా చిగురిస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల తో పాటు మూడు టి20 లు నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) కృషి చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఆయన నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రావడంలేదని వార్తలు వస్తున్నాయి. అయితే సాఫ్ట్ గా వెళ్తే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పనులు కావడం లేదని.. తమీమ్ ఇక్బాల్ సపరేట్ రూట్ ఎంచుకున్నాడట. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చాడట.

టీమిండియాతో మ్యాచ్ లు నిర్వహించాల్సిందేనని.. దానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతులతో పాటు భద్రత కావాలంటూ డిమాండ్ చేశారట. టీమిండియా ప్లేయర్లు బంగ్లాదేశ్ కు వస్తే ఈగ కూడా వాలకుండా చూడాలని స్పష్టం చేశారుట. ప్రస్తుత పరిస్థితులలో టీమిండియాతో మ్యాచ్ లు నిర్వహిస్తే బోర్డు ఆదాయం పెరుగుతుందని నివేదిక బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందు పెట్టాడట తమీమ్ ఇక్బాల్. ఒకవేళ తన ప్రతిపాదనలను తిరస్కరిస్తే… BCB వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడట. టీమిండియాతో మ్యాచ్లు నిర్వహించేందుకు తాను ఎంతకైనా సిద్ధపడతానని వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ లు ఎప్పుడంటే ?

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేల తో పాటు మూడు టీ20 లు జరగాల్సి ఉంది. గతంలోనే జరగాల్సి ఉండగా… ఈ సిరీస్ వాయిదా పడుతూ వస్తోంది. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో టోర్నమెంట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా వన్డేలు ఆ తర్వాత టి20 లో జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ జరిగితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ క్రికెటర్లు మళ్ళీ ఐపీఎల్ ఆడే అవకాశాలు మెరుగవుతాయి.

ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌలర్లకు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగకుండా మాస్టర్ ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live