Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమిండియాకు అవమానం..టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్‌, కంపుకొట్టే టాయిలెట్స్‌

టీమిండియాకు అవమానం..టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్‌, కంపుకొట్టే టాయిలెట్స్‌

Big TV Live 3 weeks ago

ASIAN GAMES 2026: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది.

టీమిండియా ఉండే డ్రెస్సింగ్ రూమ్ లలో సరైన సౌకర్యాలు లేవని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్ తయారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే 500 మీటర్ల దూరంలో టాయిలెట్స్ పెడుతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా B జట్టును ( Team India) ఏషియన్ గేమ్స్ కోసం పంపేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. హై క్లాస్ ఏర్పాట్లు లేకపోవడంతో… వైభవ్ సూర్య వంశీ, ప్రియాంష్ ఆర్య లాంటి కుర్ర క్రికెటర్లను పంపించి చేతులు దులుపుకునేందుకు బీసీసీఐ (BCCI) రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

టెంట్లు వేసి, డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారంటూ విమర్శలు

జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఈ ఏషియన్ గేమ్స్ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై బీసీసీఐతో పాటు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టెంటులు వేసి, డ్రెస్సింగ్ రూమ్స్ తయారు చేశారట. ఈ డ్రెస్సింగ్ రూమ్ లకు 500 మీటర్ల దూరంలో వాష్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఫోటోలు అవుతున్నాయి. అయితే ఈ వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సరైన సదుపాయాలు ఏషియన్ గేమ్స్ లో ( (2026 Asian Games tournament)) ఏర్పాటు చేయలేదని… శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఉన్న టీమిండియాను తాము పంపించబోమని ఇప్పటికే నిర్ణయం తీసుకుందట బిసిసిఐ. ఆ జట్టు స్థానంలో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంష్ ఆర్య లాంటి కుర్రర్ క్రికెటర్లను పంపించేందుకు సిద్ధమయ్యారట. స్టార్ క్రికెటర్లను ఈ ఏషియన్ గేమ్స్ కు పంపించబోమని ఇప్పటికే తేల్చి చెప్పిందట బీసీసీఐ. ఈ క్రమంలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ అయింది.

2026 ఆసియా క్రీడాల షెడ్యూల్ ఇదే

2026 ఆసియా క్రీడాలు (2026 Asian Games tournament) జపాన్ లో ( Japan) జరగనున్నాయి. ఈ క్రీడాలు సెప్టెంబర్ 28వ తేదీన ప్రారంభం అవుతాయి. ఇదే రోజున టీమిండియా… గ్రూప్ – ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ సాధించుకుంది. ఈ మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సెమీ ఫైనల్స్ అక్టోబర్ ఒకటో తేదీన ఉండనుండగా ఫైనల్స్ అక్టోబర్ మూడవ తేదీన నిర్వహిస్తారు. అటు టీమిండియా మహిళల జట్టు సెప్టెంబర్ 18వ తేదీన జపాన్ తో తలపడుతుంది.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంటలోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్పగించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live