Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

Big TV Live 4 days ago

Air India Flight: ఈ మధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు తీవ్రమవుతున్నాయి. ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియాకి చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చాయి.

పరిస్థితి గమనించిన పైలట్, వెంటనే అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అసలు ఏం జరిగింది?

బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుండి ఢిల్లీకి వస్తోంది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని వాష్ రూమ్‌లో సిబ్బంది ఓ టిష్యూ దొరికింది. అందులో బాంబ్ అనే పదం రాసి ఉంది. దాన్ని క్యాబిన్ సిబ్బంది తొలుత గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే వారు పైలట్ల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయ్యింది. విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను వెంటనే దించేశారు.

సౌదీ నుంచి ఢిల్లీ విమానం.. టిష్యూ పేపర్ ఎంత పని చేసింది?

అప్పుడు విమానంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సహా భద్రతా సంస్థలు పూర్తిగా తనిఖీ చేశాయి. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అందులోని ప్రయాణికులకు టెర్మినల్‌-2లో అప్పటివరకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదవ్ తెలిపారు. విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న దానిపై దర్యాప్తు ప్రారంభించాయి. విమానంలోని ప్రయాణికులను విచారించారు.

ఒకప్పుడు జైలు.. ఇప్పుడు లగ్జరీ హోటల్.. ఈ వింత ప్రదేశం ఎక్కడ ఉందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live