Salt side effects: కూరలో తగినంత ఉప్పు లేకపోతే ముద్ద దిగదు అని చాలా మంది ప్లేటులో ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకుని మరీ తింటుంటారు. చిప్స్, పిజ్జాలు, పచ్చళ్లు అంటూ రోజు వారీ లైఫ్‌లో సోడియం మోతాదును విపరీతంగా పెంచేస్తున్నారు.
అయితే.. ఉప్పు ఎక్కువైతే కేవలం హైపర్ టెన్షన్ మాత్రమే వస్తుందని అనుకుంటే పొరపాటే.ఎక్కువ ఉప్పు తినడం వల్ల మీ చర్మం త్వరగా ముడతలు పడి, చిన్న వయసులోనే ముసలివాళ్లలా కనిపిస్తారని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఉప్పు మన ఆరోగ్యాన్ని, అందాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ ఉప్పు తింటే ముఖంపై ముడతలు ఎందుకు వస్తాయి?
మనం తినే ఉప్పులో సోడియం ఉంటుంది. డీలో సోడియం లెవెల్స్ ఎక్కువైనప్పుడు, మన శరీరం ఆ ఉప్పును బ్యాలెన్స్ చేయడానికి కణాల్లో ఉండే నీటిని లాగేసుకుంటుంది. దీనినే సైన్స్ భాషలో ‘డీహైడ్రేషన్’అంటారు.
కొల్లాజెన్ దెబ్బతింటుంది:చర్మం బిగుతుగా, యంగ్‌గా ఉండటానికి ‘కొల్లాజెన్’, ‘ఎలాస్టిన్’ అనే ప్రోటీన్లు అవసరం. శరీరంలో ఉప్పు ఎక్కువైనప్పుడు చర్మంలోని తేమ ఆవిరైపోయి,ఈ కొల్లాజెన్ విరిగిపోతుంది.
పఫ్ఫీ ఐస్:రాత్రి పూట సాల్టీ ఫుడ్స్ (ఫ్రైస్, బిర్యానీ) తిని పడుకుంటే..మరుసటి రోజు ఉదయం కళ్ల కింద వాపులు రావడం గమనించవచ్చు. దీనికి కారణం సోడియం వల్ల వాటర్ రిటెన్షన్ జరగడమే.
అకాల ముసలితనం: చర్మం నిరంతరం డీహైడ్రేట్‌గా మారడం వల్ల సాగే గుణాన్ని కోల్పోతుంది. ఫలితంగా ముఖంపై కళ్ల చుట్టూ చాలా త్వరగా ముడతలు, ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి.
సైలెంట్ కిల్లర్: ఉప్పు,అధిక రక్తపోటు:
ఇక ఉప్పుకు, హై బీపీకి ఉన్న లింక్ అందరికీ తెలిసిందే అయినా.. అది బాడీ లోపల ఎంత ప్రమాదకరంగా మారుతుందో చాలా మందికి తెలియదు.
రక్తనాళాలపై ఒత్తిడి:రక్తంలో సోడియం పెరిగినప్పుడు, అది నీటిని ఎక్కువగా హోల్డ్ చేస్తుంది. దీని వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది.
గుండెకు డబుల్ డ్యూటీ:బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల గుండె ఆ రక్తాన్ని పంప్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరుగుతుంది, దీనినే మనం ‘హై బ్లడ్ ప్రెజర్’ అంటాం.
స్ట్రోక్ ప్రమాదం: లాంగ్ టర్మ్‌లో ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగితే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ 80% పెరుగుతుంది. కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశం ఉంది.
ఈ ‘సాల్ట్ ట్రాప్’ నుంచి బయటపడటం ఎలా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో మనం తెలియకుండానే అంతకంటే డబుల్ తింటున్నాం. దీనికి చెక్ పెట్టాలంటే..
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు నో చెప్పండి:మనం వండుకునే కూరల కంటే చిప్స్, సాస్‌లు,ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన సూప్‌లు, బేకరీ ఫుడ్స్‌లో ఉప్పు విపరీతంగా ఉంటుంది. వాటిని తగ్గించండి.
పచ్చళ్లను లిమిట్‌లో ఉంచండి:మన సౌత్ ఇండియన్ ఇళ్లలో ఊరగాయలు లేనిదే ముద్ద దిగదు. కానీ ఊరగాయల్లో ప్రిజర్వేటివ్స్ కోసం ఉప్పు చాలా వేస్తారు. కాబట్టి వీటిని టేస్ట్ కోసం మాత్రమే కొద్దిగా వాడండి.
పొటాషియం ఫుడ్స్ పెంచండి: ఉప్పు ప్రభావాన్ని బాడీలో తగ్గించాలంటే పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, కొబ్బరినీళ్లు, ఆకుకూరలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి సోడియంను బయటకు పంపేస్తాయి.
ఎక్కువ నీళ్లు తాగండి: రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల బాడీలోని ఎక్స్‌ట్రా సోడియం యూరిన్ రూపంలో ఫ్లష్ అవుతుంది. స్కిన్ కూడా గ్లో అవుతుంది.
రుచి కోసం ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అందమైన చర్మాన్ని, లైఫ్ లాంగ్ ఉండే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తున్నాం. ఇప్పుడే అలర్ట్ అవ్వకపోతే యంగ్ ఏజ్‌లోనే బీపీ టాబ్లెట్లు వేసుకోవడం, ముఖం ముడతలు పడిపోవడం ఖాయం. కాబట్టి.. ఈ రోజు నుంచే మీ ప్లేటులో ఉప్పును కాస్త తగ్గించండి. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకుని ఎప్పటికీ యంగ్‌గా, హెల్తీగా మెరిసిపోండి.

