చాలా మంది టీ చేసిన తర్వాత అందులో వాడేసిన టీ పౌడర్‌ని పారేస్తారు. కానీ ఆ మిగిలిన టీ పొడి ఇంట్లో చాలా పనులకు ఉపయోగపడతాయి. వాటితో శుభ్రపరచడం, తోటపని, చర్మ సంరక్షణ, దుర్వాసన పొగొటొచ్చు.
మొక్కలకు ఎరువుగా
మిగిలిన టీ పొడిలో పోషకాలు ఉంటాయి. ఇది మొక్కల కోసం సహజంగా కంపోస్ట్ లాగా పనిచేస్తుంది. ఇంట్లో గార్డెన్ లేదా మొక్కల కుండీలు ఉంటే ఈ టీ పొడిని నేరుగా మట్టిలో కలిపేయవచ్చు. టీ పొడి నేలలోని తేమను నిలుపుకోవడానికి, మట్టి టెక్స్‌చర్ పెంచడానికి ఉపయోగపడతాయి. రోజ్ మొక్కలు, మనీ ప్లాంట్ బాగా పెరుగుతాయి. మట్టిలో వేయడానికి ముందు టీ ఆకుని బాగా కడగాలి.
దుర్వాసన పోగొట్టడానికి
టీ పొడి ఇంట్లో దుర్వాసన పొగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఎండిన టీ ఆకులు ఫ్రిజ్, బూట్ల ర్యాక్, వంటగది దుర్వాసన తగ్గిస్తాయి. వాడేసిన టీ ఫొడిని ఎండబెట్టి ఒక గుడ్డ సంచిలో వేసి ఫ్రిజ్లో పెట్టండి. దుర్వాసన తగ్గుతుంది.
వంటసామాను శుభ్రపరచడానికి
టీ పొడి కొవ్వు, నూనె మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయి. టీ పొడి కాస్త నీళ్లలో కలిపి నూనె పట్టిన పాత్రలు శుభ్రం చేయవచ్చు. దీని వల్ల కిచెన్ రసాయనిక క్లీనర్ల వాడకం తగ్గుతుంది.
కంపోస్ట్ తయారీ
టీ పొడి త్వరగా కుళ్లిపోతుంది. కూరగాయల తొక్కలు, పండ్ల చెత్తతో టీ పొడి కలిపి కంపోస్ట్ చేయవచ్చు. ఇది నేల సారాన్ని పెంచుతుంది. రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది.
ఫర్నీచర్ మెరుపు కోసం
నీళ్లలో కాస్త టీ పొడి కలిపి దాన్ని ఫిల్టర్ చేయండి. దాంతో చెక్క ఫర్నీచర్ తుడవండి. ఫర్నిచర్‌పై ఉన్న దుమ్ము మరకలు కూడా తొలగిపోతాయి. గుడ్డను టీ పౌడర్ నీటిలో తడిపి తేలిగ్గా తుడవాలి. ఎక్కువ నీళ్లు వాడకండి.
పొట్ట బయటకు వేలాడుతోందా? కేవలం 21 రోజులు ఇవి తింటే చాలు.. బరువు తగ్గడంతోపాటు ఎన్నో లాభాలు
జుట్టు సంరక్షణకు
చల్లారిన టీ నీళ్లతో జుట్టు కడగడం వల్ల తలమీద జిడ్డు తగ్గుతుంది. జుట్టు కూడా మృదువుగా మారుతుందని కొందరు నమ్ముతారు. టీ నీళ్లు పూర్తిగా చల్లారాకే వాడాలి.
కళ్ల అలసట తగ్గించడానికి
చల్లారిన టీ బ్యాగులను కళ్లపై పెట్టుకోవడం వల్ల కంటి అలసట తగ్గుతుంది. టీలోని యాంటీఆక్సిడెంట్లు కళ్ల కింద వాపును తగ్గించడానికి సహాయపడతాయి. వేడిగా ఉన్న టీ బ్యాగులను కళ్లపై పెట్టుకోకూడదు.
పురుగుల నివారణకు
ఎండిన టీ ఆకులను కిటికీల దగ్గర, మొక్కల చుట్టూ చల్లడం వల్ల చిన్న పురుగులు దూరంగా ఉంటాయి. వాటి వాసన పురుగులను తరిమికొడుతుంది. ఇది సహజమైన నివారణ పద్ధతి.
చేతుల వాసన తొలగించడానికి
వంట చేసిన తర్వాత చేతుల్లో ఉల్లి, వెల్లుల్లి, చేపల వాసన వస్తుంది. మిగిలిన టీ ఆకులను చేతులకు రుద్దుకుంటే ఆ వాసన పోతుంది. తర్వాత సబ్బుతో కడుక్కోవాలి.
ముఖ్యమైన జాగ్రత్తలు
టీ పొడి తిరిగి వాడే ముందు బాగా కడగాలి. అందులో పాలు, చక్కెర మిగిలి ఉంటే బ్యాక్టీరియా పెరుగుతుంది. టీ పొడి ఎండబెట్టి నిల్వ చేయాలి. చెడిపోయిన, దుర్వాసన వచ్చే పొడిని ఎప్పుడూ వాడకూడదు.
మిగిలిన టీ ఆకులు పారేయకుండా తోటపని, శుభ్రత, చర్మ సంరక్షణకు వాడుకోవచ్చు. ఇది పర్యావరణానికి మంచిది, డబ్బు ఆదా అవుతుంది.

