Vijay Politics :తమిళ నాట విజయ్ అధికారంలోకి వచ్చేస్తుండటంతో సినిమాలకి, రాజకీయాలకి మధ్య ఉన్న అనుబంధం మరోసారి తెరమీదికి వస్తుంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు అలా సినీ రంగం నుండి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సీయం సీటుపై కూర్చున్న వారే.
అయితే స్వంతంగా పార్టీ పెట్టి సీయం సీటు ఎక్కింది మాత్రం ఎక్కింది ఒక్క ఎంజీఆర్ మాత్రమే.యస్.. 1977లో ఎంజీఆర్ DMK నుంచి విడిపోయి AIDMK పార్టీని పెట్టి సెన్సేషన్ విక్టరీ కొట్టాడు.ఇక జయలలిత సీయం అయినప్పటికీ అది అప్పటికే పాతుకుపోయి ఉన్న అన్నాడీఎంకే పార్టీ నుండే.
ALSO READ :గాయపడ్డ సింహం గర్జించలేదు.. జెట్లీ స్పీడ్ అందుకోలేదు.. మే తొలివారం డిజాస్టర్?
ఎంట్రీ ఇవ్వకుండానే ఎగ్జిట్ ఇచ్చిన రజిని
అయితే ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్స్ గా ఎదిగిన రజినీకాంత్, కమల్ హాసన్ లు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సీయం సీట్లో కూర్చుంటారని అనుకున్నారు చాలామంది. తలైవాగా రజినీకి, లోకనాయకుడుగా కమల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది.
కానీ పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టకుండానే వెనక్కి వెళ్లిపోయాడు రజిని.1996 నుండి ఊరించిన రజిని చివరికి 2017లో పొలిటికల్ ఎంట్రీని కన్ఫాం చేశాడు కూడా.
కానీ 2021లో ఆరోగ్యం సహకరించట్లేదు అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఎగ్జిట్ ఇచ్చాడు.ఈ క్రమంలోనే పొలిటకల్ పార్టీ కోసం ఏర్పాటు చేసిన రజనీ మక్కల్ మండ్రం (RMM)ని రద్దు చేసి తిరిగి ‘రజనీ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్’గా మార్చేశాడు.దీంతో రాజకీయాల్లోకి వచ్చి సీయం అవుతాడని ఆశ పడ్డ రజని ఫ్యాన్స్ కలలు కల్లలైపోయాయ్.మరి రజిని అనారోగ్యంతో యూ టర్న్ తీసుకున్నాడా లేక ఆ సాకుతో తను రాజకీయాల్లోకి అడుగు పెడితే ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయి వందల కోట్ల సినిమా మార్కెట్ వదులుకోవాల్సివస్తుందనా తెలీదు కాని మొత్తానికి నా వల్ల ఈ రాజకీయాలు కాదు బాబోయ్ అంటూ యుద్ధం మొదలెట్టకుండానే అస్త్ర సన్యాసం చేశాడు.
కమల్ – పార్ట్ టైమ్’ పొలిటీషియన్
ఇక రజినీ పరిస్థితి ఇలా ఉంటే కమల్ హసన్ ది మరో స్టోరీ..ఈ బురద రాజకీయాలని నేను కడిగేస్తానంటూ 2018లో మక్కల్ నీది మయ్యం(ప్రజల న్యాయ కేంద్రం) పార్టీని స్థాపించాడు.అందరిలా నా సిద్ధాంతం ‘లెఫ్ట్ కాదు, రైట్ కాదు.. సెంటర్’ (మధ్యేవాదం) అని ప్రకటించాడు కూడా.అంతా బాగానే ఉంది. కానీ పోటీ చేసిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మరియు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో MNM కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయాడు కమల్.పైగా ఒంటరిగా సీయం అయిపోతానని కలలు కన్న కమల్ కూడా స్వయంగా ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.అవును.. కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ హాసన్ కొద్ది తేడాతో తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాన్ని మిస్ అయ్యాడు.పోనీ ఆ తర్వాతైనా సీరియస్ పాలిటిక్స్ చేశాడా అంటే అలా ఓడిపోయాడో లేదో తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయాడు.అలా ఒకవైపు సినిమాలు మరోవైపు Bigg Boss షోలతో బిజీగా ఉంటూ ‘పార్ట్ టైమ్’ పొలిటీషియన్ అన్న ముద్ర వేసుకున్నాడు.ఒక రకంగా ఈ ఇమేజే కమల్ ని రాజకీయంగా ఎవరూ నమ్మకుండా చేసింది.
ఇక సింగిల్ గా సీయం అయిపోతాననుకున్న కమల్ ప్రస్తుతం తన మక్కల్ నీది మయ్యం ఉనికినే క్వశ్చన్ మార్క్ చేసేశాడు. July 25, 2025 నాడు DMK సపోర్ట్ తో రాజ్యసభ సభ్యుడిగా (MP) ప్రమాణ స్వీకారం చేశాడు.పైగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఓపెన్ గానే DMK కి ఓటు వేయమని ప్రచారం చేశాడు కూడా.అలా పుల్ టైమ్ గా చేయాల్సిన రాజకీయాలని పార్ట్ టైమ్ గా మార్చేశాడు కమల్.
ALSO READ :ట్రోలర్స్ నోరు మూయించిన 'రాంజనా' బ్యూటీ.. నెట్టింట వైరల్!
నేను చేసి చూపిస్తానంటున్న విజయ్
అలా కమల్, రజినీలు ఎక్కలేని తమిళనాడు సీయం కుర్చీ వైపు ఇప్పుడు వేగంగా పరుగులు తీస్తున్నాడు Vijay.మీ ఇద్దరి వల్లా కానిది నేను చేసి చూపిస్తానంటూ ఊహించని ఫలితాలతో ప్రత్యర్డులకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.నిజానికి దళపతి విజయ్ .. ‘తమిళగ వెట్రి కళగం (TVK) తమిళనాట ఎన్నికల్లో పోటీ చేస్తుందని అనగానే ”హీరోగా సినిమాలు చేసుకోక ఎందుకొచ్చిన రాజకీయం ,టాప్ స్టార్స్ అయిన రజినికాంత్ వస్తానని ఊరించి వెనక్కి వెళ్ళిపోయాడు, కమల్ హసన్ పార్టీనే డక్కా మొక్కీలు తింటుంది, నీ పార్టీకి కనీసం డిపాజిట్లు వస్తాయా అని వెక్కిరించారంతా”.కాని ఫిబ్రవరి 2, 2024న స్థాపించిన విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ దాదాపు రెండేళ్ళు తిరిగే సరికే తమిళనాట అధికారం చేపట్టబోతుండటం విశేషం.యస్.. మొత్తం 234 స్థానాల్లో 100 కంటే ఎక్కువ స్థానాల్లో TVK ఆధిక్యంలో ఉందంటే విజయ్ పార్టీకి జనమెలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థమవుతుంది.
పక్కా వ్యూహంతో వెళ్ళిన దళపతి
అయితే ఇక్కడ రజినీ, కమల్ చేసిన తప్పులని చేయకుండా పక్కా వ్యూహంతో వెళ్ళాడు విజయ్.కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాల జోలికి వెళ్లనని అనౌన్స్ చేశాడు.
ఒక్కో సినిమాకు 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సినిమాలకి టాటా చెప్పేయడం అంటే అది మామూలు విషయం కాదు.రజినీ, కమల్‌లు చేయలేని సాహసం ఇది.ఇక వాళ్ళలా కేవలం అభిమాన సంఘాలను నమ్ముకోకుండా, గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ ని రెడీ చేసుకున్నాడు.రజినీలోని కన్ఫ్యూజన్, కమల్ లోని డైలమా ఇవేవి లేకుండా పాలిటిక్స్ పట్ల తనదైన క్లారిటీ ఉండటం విజయ్ కి బాగా కలిసొచ్చింది.
మొత్తానికి దిగ్గజాలుగా వెలుగొందిన రజినీ, కమల్‌లకి సాధ్యం కాని సీయం కుర్చీని పార్టీ పెట్టిన రెండేళ్లలోనే చేజిక్కించుకోబోతున్నాడు విజయ్.అంటే తమిళనాడు రాజకీయాల్లో స్వంతగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన M. G. Ramachandran తర్వాత మళ్ళీ 49 ఏళ్లకి విజయ్ ఆ రికార్డును తిరగరాయబోతున్నాడన్న మాట.
ALSO READ :హీరోయిన్ మోనాలిసా సంచలనం.. నాపై 10 సార్లు లైంగిక దాడి.. డైరెక్టర్‌పై పోక్సో కేసు!

