Vijay Politics: ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను శాసించిన ఒకే ఒక్కడు విజయ్. అంతటి సినీ ప్రజాదరణతో పాటు రాజకీయ ఆదరణ సైతం పొందిన ఏకైక సినీ హీరో విజయ్.
జయలలిత అయినా ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా రాణించారేమో.. గానీ విజయ్ మాత్రం ఎలాంటి షేడ్స్ లేని షేర్.
మూడు అక్షరాల మ్యాజిక్
MGR, NTR మూడక్షరాలే, విజయ్ ఇదీ మూడక్షరాల పేరే. ఆ ఇద్దరిలా విజయ్ సైతం ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధించిన వీరుడిగా పేరు సాధించారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు పొందిన నటుడు మాత్రం రజనీకాంత్. ఆయన సమకాలీనుడు కమల్ కూడా అంతే సమానమైన ఇమేజ్ ఉన్నవాడు. వీరితో పాటు విజయ్ కాంత్ కి కూడా అదే స్థాయిలో మాస్ ఇమేజ్ ఉండేది. కానీ వీరెవరూ కూడా ఎంజీఆర్ స్థాయిలో రాజకీయ విజయాలు సాధించ లేక పోయారు.
విజయ్ కొత్త రికార్డు
రజనీకాంత్ పార్టీ పెట్టకుండానే వెనుదిరిగితే, ఆ తర్వాత పార్టీ పెట్టిన కమల్ కోయంబత్తూరులో వానతీ శ్రీనివాసన్ అనే మహిళ చేతిలో ఓడిపోయారు. ఇక విజయ్ కాంత్ వీరిద్దరికన్నా పర్లేదనిపించినా.. ఆ తర్వాత ఆయన పలు కారణాలవల్ల రాణించలేక పోయారు. అదే విజయ్ అలాక్కాదు. ఎంజీఆర్ పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో 130 సీట్లతో విజయం సాధించి.. అధికార స్థాపన చేయగా.. ఆ తర్వాత ఆ స్థాయిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ దే.
తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం
ప్రస్తుతం తమిళనాట MGR తర్వాత అంతటి మొనగాడే లేడు. ఇప్పటి వరకూ తమిళనాడులో ఎందరో నటులు పార్టీలు పెట్టగా.. వారందరిలోకీ విజయ్ ఒక్కడే ఈ మాత్రం విజయమైనా సాధించారు. దీంతో ఇదో సరి కొత్త సినీ రాజకీయ చరిత్రగా మారింది. ఇప్పటి వరకూ ఇలాంటి విజయం చూడని సినీ పొలిటికల్ ఇండస్ట్రికి ఇదో బూస్టర్ గా నిలుస్తోంది. ఇప్పుడు స్టాలిన్ కరుణ వారసుడు కాగా, జయ ఎంజీఆర్ కి వారసురాలిగా నిలవగా.. ఇలాంటి ఏ రాజకీయ వారసత్వం లేని ఒకే ఒక్కడిగా నిలిచాడు విజయ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును సంపాదించుకుని సత్తా చాటాడు.
ఇండియన్ సినీ రాజకీయాల్లో స్పెషల్ చాప్టర్
గతంలో విజయ్ కాంత్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా నిలిచినా.. ఇలా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం అవతరించలేక పోయారు. దీంతో విజయ్ ప్రస్తానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందుకు కారణాలేంటన్న రీసెర్చ్ మొదలైంది. ఇప్పుడు తమిళ రాజకీయాలకే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ పోలిటిక్స్ లో విజయ్ ది ఒక స్పెషల్ చాప్టర్ గా నిలుస్తోంది. ఎంజీఆర్ అన్నా తాను సినిమాలు బాగా తగ్గించి, యాభై ఐదో ఏట పార్టీ స్థాపించి అరవయ్యో ఏట సీఎం అయ్యారు.. అదే, విజయ్ తాను సినిమాల్లో వంద కోట్ల పారితోషకం తీసుకుంటున్న పీక్ టైంలో అంటే 49 వ ఏట పార్టీ పెట్టి.. 51వ ఏట సీఎం పీఠానికి చేరువయ్యారు.
విజయ్ టైమింగ్ మాస్టర్ స్ట్రోక్
అప్పటికీ ఇప్పటికీ సినిమా ఏజ్ గ్రూప్ లో చాలానే తేడా వచ్చింది. ఇప్పుడు అమితాబ్, రజనీకాంత్ లేటు వయసులో కూడా గ్రేట్ సినీ విక్టరీలు నమోదు చేస్తున్నారు. దీంతో పోలిస్తే విజయ్ కి సినిమా భవిష్యత్ ఇంకా ఎంతో ఉంది. మరికొన్నాళ్ల పాటు ఆయన వందల కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుంటూ సినిమా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది కరెక్ట్ టైమ్ గా భావించిన ఆయన సినిమాలను త్యాగం చేసి రాజకీయ అరంగేట్రం చేసి అదరగొట్టారు. ఎంజీఆర్ సినిమా గ్లామర్ ని రాజకీయ శక్తిగా మార్చారు. అదే విజయ్ సినీ గ్లామర్ ని గ్రౌండ్ లెవల్ కి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఎంజీఆర్ కి లేటెస్ట్ వర్షెన్ విజయ్ అన్న పేరు సాధించారు.
తమిళ రాజకీయాల్లో హాట్ డిబేట్
ఎంజీఆర్ రాజకీయ ప్రస్తానం- విజయ్ రాజకీయ ప్రస్తానానికి పోలిక ఎలాంటిదో చూస్తే.. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ ఒక లెజెండ్ అయితే, ప్రస్తుత పరిణామాల్లో విజయ్ దళపతి ఆ వారసత్వాన్ని మరింత అడ్వాన్స్డ్ గా కొనసాగిస్తున్నారు. ఇద్దరికీ మాస్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ పుష్కలంగా ఉంది. ఎంజీఆర్ తన సినిమాల్లో ఎక్కువగా పేదల పాలిట పెన్నిధిగా కనిపించారు. అంతే కాదు అన్యాయాన్ని ఎదురించే వ్యక్తిగా ఎక్స్ పోజ్ అయ్యారు. విజయ్ కూడా తన సినిమాల్లో అదే రకమైన సామాజిక సందేశాలు ఇస్తుంటారు. దీంతో పాటు బలమైన అభిమాన సంఘాలను నిర్మించుకున్నారు.
DMKకి ఎదురు నిలిచిన ఇద్దరు ధీరులు
నిజానికి ఎంజీఆర్ కి జయలలితకన్నా మించి మహిళా ఓటర్ల అభిమాన బలముంది. ఇప్పుడు విజయ్ కి మహిళా ఓటర్లతో పాటు యువత సైతం సపోర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. అప్పుడు ఇప్పుడు ఎంజీఆర్, విజయ్ కి ఉన్న ఒకే ఒక్క సమాన మైన పోలిక ఏదంటే, ఇద్దరూ డీఎంకేని ధీటుగా ఎదుర్కోవడం. ఇక్కడే విజయ్ ని మోడ్రన్ ఎంజీఆర్ అనాల్సి వస్తోంది. ఇద్దరూ కలసి చేసిన అతి ముఖ్యమైన పని.. డీఎంకేకి ప్రత్యామ్నయంగా నిలవడం. అదే ఈ ఇద్దరనీ డీఎంకేతో ఢీ కొట్టిన ధీరులుగా నిలుపుతోంది.
విజయ్ ధైర్యానికి ఇదే నిదర్శనం
అయితే ఈ ఇద్దరికీ తేడా ఒకటి ఉంది. ఎంజీఆర్ సుమారు పదేళ్లకు పైగా డీఎంకేలో పని చేశారు. రాజకీయ లోతు పాతులు బాగా తెలుసుకున్నారు. అదే విజయ్ అలాక్కాదు. ఏ పొలిటికల్ పార్టీలో చేరలేదు. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించి ఆపై ఎన్నికల బరిలోకి ధైర్యంగా దూకేశారు. ఆపై విజయం సాధించారు. ఈ విషయంలో విజయ్ ఎంజీఆర్ కన్నా ధీశాలిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇరువురి ప్రచార శైలి ఎలాంటిదో విశ్లేషిస్తే.. ఎంజీఆర్ రోడ్ షోలు, సినిమా పాటలు, రేడియో ప్రచారాలపై ఎక్కువగా ఆధారపడ్డారు. అదే విజయ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, డేటా అనలిటిక్స్ పై డిపెండ్ అవుతున్నారు.
బ్యాడ్ టైంలో గుడ్ విక్టరీ.. విజయ్
ఎంజీఆర్ ది స్వచ్ఛమైన అన్నా ద్రవిడ సిద్ధాంతం కాగా, అదే విజయ్.. ద్రవిడత్వంతో పాటు జాతీయ వాదాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇందుకు అంబేద్కరిజాన్ని సైతం జత కలిపి సరి కొత్త పంథాలో నడుస్తున్నారు. విజయ్ ని మరీ మెచ్చుకోవల్సిన అంశమేంటంటే.. అప్పట్లో ఓటర్లు అంత మెచ్యూర్ కాదు. సినిమా వాళ్లకు గంపగుత్తగా ఓట్లు గుద్దేసేవారు. అదే ఇప్పుడు ఓటరు బాగా తెలివి మీరి పోయారు. విజయ్ కన్నా ముందు ఎందరో సినిమా హీరోలను మట్టి కరిపించేశారు. ఇలాంటి బ్యాడ్ టైంలో కూడా గుడ్ విక్టరీ నమోదు చేసిన ఒకే ఒక్కడిగా నిలిచారు విజయ్. ఇదే ఆయన్నుంచి ఇతర సినిమా స్టార్లు నేర్చుకోవల్సిన మెయిన్ కోర్ ఎలిమెంట్. అందుకే ఆయన్ను తమిళ సినీ రాజకీయాల్లో అభినవ ఎంజీఆర్ గా అభివర్ణిస్తున్నారు.
ఇంటి పనుల నుంచి చట్టసభకు.. పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన పనిమనిషి

