WhatsApp New Feature: డిజిటల్ ప్రపంచంలో చాటింగ్ చేసేవారికి వాట్సప్ ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే, దీనిలో మనం పంపే మెసేజ్‌ల భద్రత గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు.
ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సప్ సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే 'రీడ్ అండ్ డిసప్పియర్' (చదవగానే మాయం). ప్రస్తుతం ఈ ఫీచర్‌ను iOS బీటా వెర్షన్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
చదవగానే డిలీట్.. ప్రైవసీకి పెద్ద పీట:
ప్రస్తుతం వాట్సప్‌లో ఉన్న డిసప్పియరింగ్ ఫీచర్ ద్వారా మెసేజ్‌లు డిలీట్ అవ్వడానికి కనీసం 24 గంటలు పడుతుంది. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా అవతలి వ్యక్తి మెసేజ్ ఓపెన్ చేసి చదవగానే, ఆ చాట్ వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. దీనివల్ల ఫోన్లలో పాత చాట్స్ స్టోర్ అయ్యే అవకాశం ఉండదు. ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, పర్సనల్ సమాచారాన్ని పంచుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
మనకు నచ్చినంత టైమ్.. కస్టమ్ టైమర్:
కేవలం చదవగానే మాయమవడమే కాకుండా.. మెసేజ్ ఎంతసేపు ఉండాలనేది కూడా మనమే నిర్ణయించుకునేలా 'కస్టమ్ టైమర్' ఆప్షన్‌ను కూడా వాట్సప్ తెస్తోంది. ఫిక్స్‌డ్ టైమింగ్స్ కాకుండా.. 30 సెకన్లు, ఒక నిమిషం లేదా కొన్ని గంటల పాటు మెసేజ్ కనిపించేలా మనకు నచ్చిన సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది యూజర్లకు తమ చాట్స్‌పై మరింత నియంత్రణను ఇస్తుంది.
తక్కువ ధరలో బెస్ట్ టాబ్లెట్.. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన Poco Pad C1 ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!
స్క్రీన్‌షాట్ తీయడం సాధ్యమేనా?
ఈ ఫీచర్ గురించి తెలియగానే చాలామందికి వచ్చే సందేహం.. మెసేజ్ మాయమవ్వక ముందే స్క్రీన్‌షాట్ తీస్తే ఎలా అని. దీనిపై వాట్సప్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఫీచర్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు స్క్రీన్‌షాట్ తీయకుండా బ్లాక్ చేసే ప్రొటెక్షన్‌ను కూడా భవిష్యత్తులో తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
త్వరలోనే అందరికీ అందుబాటులోకి..
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ మొదట ఐఓఎస్ యూజర్లకు, ఆ తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గత కొన్ని ఏళ్లుగా వాట్సప్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే వస్తున్న ఈ రీడ్ అండ్ డిసప్పియర్ ఫీచర్ కోట్లమంది వినియోగదారులకు మరింత సురక్షితమైన చాటింగ్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పొచ్చు.
వామ్మో.. రూ.63 వేలా? సోనీ కొత్త యానివర్సరీ హెడ్‌ఫోన్స్‌లో అంత స్పెషల్ ఏముందో చూసేద్దామా!

