Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వావ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఇంత లాభమా? నిజంగా వండర్!

వావ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఇంత లాభమా? నిజంగా వండర్!

Big TV Live 2 days ago

Electric Scooter Buying:కొత్త స్కూటర్ కొనాలని అనుకుంటున్న చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు EV స్కూటర్లు ఖరీదైనవి, కొత్త టెక్నాలజీ కావడంతో చాలామంది కొనడానికి వెనుకాడేవారు.

కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పెట్రోల్ ధరలు పెరగడం, ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు లాభదాయకంగా మారింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ తో లాభం ఎలా?

సాధారణంగా చాలా మంది స్కూటర్ కొనేటప్పుడు ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే చూస్తారు. కానీ, EV స్కూటర్ల విషయంలో అసలు లాభం అక్కడితో ఆగిపోదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ ఇస్తోంది. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ప్రతి kWhకి సుమారు రూ.2,500 వరకు ప్రయోజనం లభిస్తోంది. 3.2kWh బ్యాటరీ ఉన్న స్కూటర్‌పై సుమారు రూ.8,000 వరకు ధర తగ్గే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వాల అదనపు సబ్సిడీ

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనపు సబ్సిడీలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో EV కొనుగోలుదారులకు మంచి ప్రయోజనాలు లభిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ తో కలిపి కొన్నిచోట్ల మొత్తం రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఆదా అవుతుంది. అందుకే, ఒకే స్కూటర్ ధర రాష్ట్రానికోలా మారుతూ ఉంటుంది.

కొనుగోలు తర్వాత అసలు సేవింగ్స్

ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో అసలు సేవింగ్స్ కొనుగోలు తర్వాత మొదలవుతాయి. పెట్రోల్ స్కూటర్‌ కు తరచూ ఫ్యూయెల్ నింపాల్సి ఉంటుంది. రోజూ ఆఫీస్, కాలేజీ,వ్యాపార పనుల కోసం ప్రయాణించే వాళ్లకు నెలకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ EV స్కూటర్‌ ను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఖర్చు కూడా పెట్రోల్‌ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రోజూ ఎక్కువగా స్కూటర్ వాడే వ్యక్తి సంవత్సరానికి వేల రూపాయల ఫ్యూయెల్ ఖర్చు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పెట్రోల్ స్కూటర్‌ లా ఇంజిన్ ఆయిల్ మార్చడం, క్లచ్ రిపేర్, ఎగ్జాస్ట్ సమస్యలు వంటి చికాకులు ఉండవు.

బ్యాటరీ ఛేంజ్ ఖరీదైన వ్యవహారం

EVలకు ఖర్చులే ఉండవని అనుకోవడం సరైంది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటరీ మార్చాల్సి ఉంటుంది. ఇది కొంత ఖరీదైన వ్యవహారమే. అయినప్పటికీ, రోజూ ఎక్కువగా వాడే వారికి, తక్కువ రన్నింగ్ ఖర్చు వల్ల ఆ అదనపు ధర కొద్ది కాలంలోనే కవర్ అవుతుంది. EV కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలో ఉన్న సబ్సిడీలు, ఛార్జింగ్ సౌకర్యాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అదే స్కూటర్ ఒక రాష్ట్రంలో తక్కువ ధరకు, మరొక రాష్ట్రంలో ఎక్కువ ధరకు దొరికే అవకాశం ఉంటుంది. రోజూ ఒకే దూరం ప్రయాణించే వారికి, ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉన్నవారికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు డబ్బు ఆదా చేసే తెలివైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live