Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ కు టెక్నిక్ లేదు.కళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

వైభవ్ కు టెక్నిక్ లేదు.కళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

Big TV Live 2 hrs ago

Monty Panesar On Vaibhav Suryavanshi: 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అలాంటి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ గురించి ఇంగ్లాండు మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ (Monty Panesar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీకి టెక్నిక్ లేదని… కళ్ళు మూసుకొని బ్యాట్ ఊపుతున్నాడని పరువు తీశారు. అంతేకానీ, వైభవ్ సూర్యవంశీ పీకిందేమీ లేదన్నారు. అందరి లాగా ఇండియాలో ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడిపోయాడని… బ్యాట్ పైకి బంతి వస్తేనే కొడతాడని హేళన చేస్తూ మాట్లాడారు. అంతేకానీ వైభవ్ సూర్య వంశీని పెద్ద ఆటగాడిగా ట్రీట్ చేయకూడదని.. అలా చేస్తే టీమిండియా కొంప మునిగిపోతుందని హెచ్చరించారు. దీంతో మాంటీ పనేసర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

వైభవ్ కు టెక్నిక్ లేదు…కళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

15 ఏళ్ల కుర్రోడు వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో పనేసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశం కెరీర్ ఐదేళ్ల లోపు క్లోజ్ అవుతుందని హెచ్చరించారు. అన్ని ఫార్మాట్లకు అతడు సరిపోడని వివరించారు. వైభవ్ సూర్య వంశీ చూడడానికి దిట్టంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. అంత లావుగా ఉంటే క్రికెట్ ఆడటం కష్టమేనని తెలిపారు. టి20 లలో మాత్రమే వైభవ్ సూర్య వంశీ పరుగులు రాబట్ట గలుగుతాడని స్పష్టం చేశారు. వన్డేల తో పాటు టెస్టుల్లో ఆడించే ప్రయత్నం అస్సలు చేయవద్దని.. వార్నింగ్ ఇచ్చారు. అలా కాదని అతడిని ఆడిపిస్తే మాత్రం.. టీమిండియా కొంప కొల్లేరు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అసలు అభిషేక్ శర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మతాన్ని ప్రచారం చేస్తారా ?

వైభవ్ సూర్యవంశీ ఏజ్ విషయంపై కూడా కీలక వ్యాఖ్యలు

15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) వయస్సు విషయంలో పాకిస్తాన్ క్రికెటర్లు విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. అతడి వయసు 15 సంవత్సరాలు కాదని.. 25 సంవత్సరాలు ఉంటాడని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ వాదనలపై ఇంగ్లాండు మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ (Monty Panesar ) కౌంటర్ ఇచ్చారు. వైభవ్ సూర్య వంశీ వయసు గురించి ఎవరు మాట్లాడకూడదని హెచ్చరించారు. ఆటలో వయసు కంటే… టాలెంట్ ముఖ్యమన్నారు. మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) ఇప్పటికీ కూడా ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడని.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ పై ఇంత విషం కట్టడం ఎందుకని ప్రశ్నించారు మాంటీ పనేసర్. వైభవ్ సూర్య వంశీ వయసు విషయంలో ఎలాంటి డౌట్ తనకు లేదన్నారు. కానీ అతనికి బ్యాటింగ్ టెక్నిక్ మాత్రమే లేదని వివరించారు. ఐదేళ్లపాటు మాత్రమే సరైన ప్రదర్శన ఉంటుందని… ఆ తర్వాత అతడు విఫలమవుతాడని తెలిపారు.

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం చేతకాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసారమే మొదలు పెట్టారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live