Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

Big TV Live 1 week ago

Minister Gurumurthy: వైయస్ జగన్ ప్రభుత్వంలో భోగాపురం రన్ వే నిర్మిస్తే టిడిపి నేతలు రిబ్బన్లు కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. భూ సేకరణ, పరిహారం, అనుమతులు అన్ని పనులు పూర్తి ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే అని మంత్రి గురుమూర్తి తేలచ్చి చెప్పారు.

రైతుల త్యాగాలతో ఎయిర్ పోర్టు వచ్చిందని, ఈ ప్రభుత్వ హయంలో విమాన చార్జీలు పెంచారని ఫైర్ అయ్యారు.

పెరిగిన చార్జీలు..

ఏపీలో ప్రయాణికుల వృద్ధి శాతం పడిపోయిందన్నారు. తిరుపతికి విమాన చార్జీలు పెంచి వచ్చే భక్తులకు గుండు కొడుతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కానీ భోగాపురం పైన పెమ్మసాని చంద్రశేఖర్ అబద్ధాలు వల్లిస్తున్నారని ఫైర్ అయ్యారు. భోగాపురం పై వైయస్ జగన్ చేసిన కష్టాన్ని క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నారని దయ్యబట్టారు. మీరెంత క్రెడిట్ చోరీ చేసినా.. ప్రభుత్వ రికార్డులు వైయస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని ఆయన అన్నారు. 2019లో టిడిపి భూసేకరణ జరపలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ జరిపి రైతులకు నష్టపరిహారం ఇచ్చిందని మంత్రి గురుమూర్తి గుర్తు చేశారు. ఆ తర్వాతే 2023 లోనే GMR తో భోగాపురం విమానాశ్రయానికి ఒప్పందం జరిగిందని అన్నారు.

Also read: కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

ప్రపంచంలోనే అత్యంత..

టిడిపి నేతల భూదాహానికి భయపడి కోర్టులో కేసులు వేసింది రైతులు.. మత్స్యకారులు మాత్రమే. 15వేల ఎకరాలు కావాలని టిడిపి ప్రభుత్వం ప్రకటనలతో రైతులు భయపడిపోయారన్నారు. ఈ కేసులన్నీ 2022లోనే కొట్టేశారని, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే లండన్ లోని హీత్రో ఎయిర్ పోర్ట్ మూడు వేల ఎకరాల్లోనే ఉందని అన్నారు. ఏపీలో 15వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 2700 ఎకరాలు తీసుకొని విమానాశ్రయానికి భూమి అడ్డంకులను తొలగించామని గోప్పుల చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

ఢిల్లీ పార్లమెంట్‌లో భోగాపురం రచ్చ.. సీఎం చంద్రబాబుకు మంత్రి తనూజ రాణి సవాల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live