Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వనస్థలిపురంలో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని బావను కొట్టి చంపిన బావమరిది!

వనస్థలిపురంలో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని బావను కొట్టి చంపిన బావమరిది!

Big TV Live 4 days ago

Vanasthalipuram: స్వేచ్ఛ బ్యూరో: అక్కను వేధిస్తున్నాడన్న కక్షతో బావను దారుణంగా హత్య చేశాడు బావమరిది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వనస్థలిపురం పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

వనస్థలిపురం డబుల్​ బెడ్రూం ఇంట్లో నివాసముంటున్న హాజీపూర్ కు చెందిన వెంకటేశ్​ 2015లో స్వప్న అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వెంకటేశ్​ తన మకాంను ఎస్​ఆర్​ నగర్​ కు మార్చాడు. మంగళవారం రాత్రి వనస్థలిపురం వచ్చి పిల్లలను చూపించమని స్వప్నను అడిగాడున. ఆ సమయంలో అక్కడ స్వప్న తమ్ముడు దుబ్బల పాండు కూడా ఉన్నాడు. పిల్లలను చూపించేది లేదని స్వప్న చెప్పటంతో గొడవ మొదలైంది.

దాంతో కోపంతో రెచ్చిపోయిన పాండు వెంకటేశ్​ తలపై బరువైన వస్తువుతో బలంగా కొట్టాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్​ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం 7వ అంతస్తు నుంచి మృతదేహాన్ని కిందకు తెస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్వప్న, పాండుతోపాటు అతనిస్నేహితుడు జగదీశ్​ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసును వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live