Varanasi Movie: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం వారణాసి.. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాకి తాజాగా వేసవి సెగ తగిలిందని చెప్పాలి. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది.. వారణాసి సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలుసుకోవాలని మహేష్ బాబు అభిమానులు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. అసలు ఈ సినిమాకి వేసవిలో వచ్చినా కష్టం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు
వారణాసి కోసం 150 నీటి ట్యాంకర్లు..
రాజమౌళి సినిమాలు అంటే కాస్త స్లోగానే ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రాబోతున్న వారణాసి పై కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాల క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్లో జరుగుతున్న విషయం తెలిసిందే.. గగన్‌పహాడ్ ప్రాంతంలో వేసిన సెట్ లో, సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. ఇందులో భాగంగా ఈ మూవీకి హైలెట్ గా నిలిచే ఒక సీన్ నీటి అడుగు భాగంలో ఉంటుందట.. ఆ సీన్ కోసం దాదాపు పదివేల లీటర్లకు పైగా నీళ్లు అవసరమవుతాయట. అంటే 150 వాటర్ ట్యాంకర్లు.. 150 ట్యాంకర్ల నీటిని కోరుతూ హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బిని టీమ్ ను వారణాసి టీమ్ కోరగా.. హైదరాబాద్ వాటర్ బోర్డు సంస్థ వాళ్ళ అభ్యర్థనను తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది. 150 ట్యాంకర్ల నీళ్లు అవసరం ఉందని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ తరపున హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బి మేనేజింగ్ డైరెక్టర్ కి లేఖ రాసినట్లు ఓ స్క్రీన్ షార్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వారణాసి టీం స్పందించేంతవరకు వెయిట్ చేయాలి..
Also Read :డాక్టర్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. సీరియల్స్ కు గుడ్ బై..
రాజమౌళికి దిమ్మతిరిగే షాక్..
రాజమౌళి దర్గా ఎక్కించిన చాలా వరకు సినిమాలలో నీటి అడుగు బాగా నా కొన్ని సీన్లు ఉంటాయి.. త్రిబుల్ ఆర్ లో కూడా అలాంటి సీన్ ఉంది.. ఈ సినిమాలో కూడా ఆ సీనే హైలెట్గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. అలాంటి భారీ సెట్ ఉన్న సీన్ఇప్పుడు నీళ్ల కొరత కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.. హైదరాబాద్ వాటర్ సప్లై సినిమాకు నీళ్ల కష్టాలని తొలగిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజమౌళి ఇంకేదైనా మార్గాన్ని వెతుకుతాడా? లేదంటే ఆ సీన్ ని పోస్ట్ పోన్ చేస్తాడా? అన్నది చూడాలి.. ఈ మూవీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో జక్కన్న ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ మార్చ్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో టీం ఉన్నారు. మరి ఇప్పుడు షూటింగ్ కి అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో సినిమా పోస్ట్ పోన్ అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై జక్కన్న టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

