Maa Inti Bangaram: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత(Samantha) ఇటీవల ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత ఈమె వెండితెర పై కనిపించలేదని చెప్పాలి. ఇలా తన వ్యక్తి గత విషయాల కారణంగా ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తూ పలు సినిమాలకు కమిట్ అవుతున్నారు. సమంత ప్రస్తుతం ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా తన సొంత నిర్మాణ సంస్థలో ఈమె మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
వాయిదా దిశగా సమంత బంగారం..
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఈ సినిమాని మే 15వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా విడుదల తేదీని ప్రకటించారు..అదేవిధంగా ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా మంచి అంచనాలను పెంచేసింది. ఇలా 15వ తేదీ మా ఇంటి బంగారం విడుదల కాబోతుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.
ఐపీఎల్ ప్రభావం..
మే 15వ తేదీ విడుదల కావలసిన మా ఇంటి బంగారం సినిమా విడుదల వాయిదా పడిందని సమాచారం. ఈ సినిమా మే 15వ తేదీ నుంచి జూన్ 4వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూన్ 4వ తేదీ విడుదల కావాల్సిన టాక్సిక్ సినిమా వాయిదా పడటంతో ఆ రోజున సమంత మా ఇంటి బంగారం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్(IPL) జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ కారణంగా సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎవరు థియేటర్లకు రావడం లేదు. ఐపీఎల్ కారణంగానే ఈ సినిమాని వాయిదా వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
జూన్ 4న రాబోతున్న పెద్ది..
ఒకవేళ ఈ సినిమా మే 15న వాయిదా పడి జూన్ నాల్గవ తేదీ కనుక విడుదల అయితే కచ్చితంగా రామ్ చరణ్ పెద్ది సినిమాకు పోటీగా విడుదలవుతోందని చెప్పాలి. పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ జూన్ నెలలో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అయితే జూన్ 4వ తేదీ టాక్సిక్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో జూన్ 25న పెద్ది విడుదల చేయాలని భావించారు. ఉన్నఫలంగా టాక్సిక్ వాయిదా పడటంతో పెద్ది జూన్ 4 ను టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ పెద్ది జూన్ 4వ తేదీ విడుదల అయితే కచ్చితంగా సమంత రామ్ చరణ్ కు పోటీ పడబోతుందని చెప్పాలి.

