Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేసవిలో చెరకు రసం తాగే ముందు ఈ నిజం తెలుసుకోకపోతే అంతే సంగతులు!

వేసవిలో చెరకు రసం తాగే ముందు ఈ నిజం తెలుసుకోకపోతే అంతే సంగతులు!

Big TV Live 2 weeks ago

Summer Hydration :అసలే ఎండాకాలం ..పైగా ఈ ఏడు సూరి మామ కురిపించే ఎండలకి బాడీ చాలా త్వరగాబాడీ డీహైడ్రేట్ అయిపోతోంది. ఇలాంటి టైమ్‌లో రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం బండి మనల్ని రమ్మని తెగ ఊరిస్తుంది.ఇక గ్లాసు నిండా ఆ జ్యూస్ ని ఒక్క పట్టు బడితే బాడీ కూలర్ గా మారిపోతుందని కలలు కంటాం.ఇక వరుస పెట్టి తాగితే వచ్చే మజా మాములుగా ఉండదంటూ గ్లాసులో కొద్ది తాగేస్తుంటాం.కానీ,అలా చేస్తే మీ బాడికి అస్సల్ మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్స్ .

లీటరు చెమటలో 900 మిల్లీగ్రాముల సోడియం

అసలు విషయంలోకి వెళ్తే, మన శరీరం ఎండలో తిరిగినప్పుడు చెమట ద్వారా భారీగా సోడియంను కోల్పోతుంది. ఒక లీటరు చెమటలో సుమారు 900 మిల్లీగ్రాముల సోడియం బయటకు పోతే, మనం తాగే ఒక గ్లాసు చెరకు రసంలో ఉండేది కేవలం 11 నుండి 17 మిల్లీగ్రాములు మాత్రమే. అంటే, శరీరంలో నీటిని నిల్వ ఉంచే సోడియం అందక, మీరు ఎన్ని గ్లాసులు తాగినా అది కేవలం చక్కెర నీళ్లు తాగినట్టే అవుతుంది తప్ప, మీ బాడీకి కావాల్సిన అసలైన హైడ్రేషన్ అందదు.

also read :టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సమ్మర్.. 2027లో బాక్సాఫీస్ దగ్గర 3000 కోట్ల వేట

ఏకంగా 25 నుండి 40 గ్రాముల వరకు చక్కెర
ఇక రెండో ప్రధాన సమస్య చక్కెర స్థాయిలు. ఒక గ్లాసు చెరకు రసంలో ఏకంగా 25 నుండి 40 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ఎండలో అలసిపోయి ఉన్నప్పుడు దీన్ని తాగితే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే ఇన్సులిన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది తాత్కాలికంగా కాస్త ఎనర్జీ ఇచ్చినట్లు అనిపించినా, లాంగ్ రన్‌లో హైడ్రేషన్‌కు ఏమాత్రం ఉపయోగపడదు. దీనికి తోడు రోడ్డు పక్కన అమ్మే రసంలో హైజీన్ గా ఉంటాయా అంటే అనుమానమే. ఆ యంత్రాల శుభ్రత, వాడే ఐస్ క్వాలిటీపై నమ్మకం ఉండదు. కలుషిత నీటితో తయారు చేసిన ఐస్ వాడటం వల్ల టైఫాయిడ్, జాండిస్, కలరా వంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం 100 శాతం ఉంటుంది. ఈ-కోలి వంటి బ్యాక్టీరియాలు బాడీలోకి ప్రవేశించి వేసవిలో ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారుస్తాయి.

బాడీని కాపాడుకోవడానికి ఏం తాగాలి
అయితే మరి ఈ ఎండల నుంచి బాడీని కాపాడుకోవడానికి ఏం తాగాలి? అంటే వైద్యులు ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా .. సాదా సీదా ‘ఉప్పు కలిపిన నిమ్మరసం’. నీళ్లలో నిమ్మరసం పిండుకుని, కొంచెం ఉప్పు కలుపుకుని తాగితే బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. ఇది శరీరంలో నీటిని నిల్వ ఉంచి ఎండ దెబ్బ (హీట్ స్ట్రోక్) తగలకుండా రక్షిస్తుంది. చెరకు రసాన్ని కేవలం ఒక జ్యూస్ లా అప్పుడప్పుడు తాగడంలో తప్పులేదు కానీ, అది మిమ్మల్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుందని మాత్రం భ్రమపడొద్దు. సో ఈ సమ్మర్ లో మీ ప్రయారిటీ మజ్జిగ, కొబ్బరి నీళ్లు మరియు ఉప్పు కలిపిన నిమ్మరసంపైనే ఉంచే ప్రయత్నం చేయండి .ఓకే నా !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live