Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెస్టిండీస్ ఘోర ఓటమి..3 ఏళ్ల పాకిస్తాన్ ఆకలి తీర్చిన బాబర్ ఆజం

వెస్టిండీస్ ఘోర ఓటమి..3 ఏళ్ల పాకిస్తాన్ ఆకలి తీర్చిన బాబర్ ఆజం

Big TV Live 1 week ago

Pakistan Beats West Indies: వెస్టిండీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ జట్టుకు (Pakistan) బిగ్ రిలీఫ్ దక్కింది. మొదటి టెస్టులో ఓడిపోయిన పాకిస్తాన్, రెండు టెస్టులో అద్భుతంగా రాణించి విక్టరీ అందుకుంది.

వెస్టిండీస్ పై (West Indies) రెండో టెస్టులో ఏకంగా 8 వికెట్ల తేడాతో బాబర్ ఆజం సేన బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో టెస్ట్ సిరీస్ 1-1 తేడాతో రెండు జట్లు పంచుకున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్, విదేశీ గడ్డపై విక్టరీ అందుతుందని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఊపు ఇలాగే కొనసాగించాలని కూడా మాజీ క్రికెటర్లు కోరుతున్నారు.

వరుస సిక్సర్లతో బాబర్ విధ్వంసం.. రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొన్న జూలై 25వ తేదీన షురూ అయింది. అయితే ఈ టోర్నమెంట్లో మొదటి టెస్టులో వెస్టిండీస్ విజయం సాధించగా… ప్రస్తుతం జరిగిన రెండో టెస్టులో మాత్రం పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విక్టరీ అందుకుంది. రెండో ఇన్నింగ్స్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి.. కెప్టెన్ బాబర్ ఆజం మ్యాచ్ గెలిపించాడు.

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేయగా 344 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ లో 117 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది వెస్టిండీస్. ఇక్కడే పాకిస్తాన్ చేతిలోకి మ్యాచ్ వచ్చేసింది. అటు పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో టెస్ట్ సిరీస్ సమమైంది.

3 ఏళ్ల పాకిస్తాన్ ఆకలి తీర్చిన బాబర్ ఆజం

వెస్టిండీస్ పై రెండో టెస్టులో విజయాన్ని నమోదు చేసుకున్న బాబర్ ఆజం సేన సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు మూడేళ్ల తర్వాత విదేశీ గడ్డపై తొలి టెస్ట్ విజయం సాధించింది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ మూడు సంవత్సరాల ఆకలిని మళ్లీ బాబర్ ఆజం తీర్చాడంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. 2023లో శ్రీలంక గడ్డపై ఆ జట్టును బాబర్ ఆజం కెప్టెన్సీ లోని అప్పటి పాకిస్తాన్ జట్టు ఓడించింది. ఆ తర్వాత విదేశీ సిరీస్ లలో ఒక్క మ్యాచ్ అంటే ఒక్కటి కూడా గెలవలేదు పాకిస్తాన్.

మళ్లీ బాబర్ ఆజం కెప్టెన్సీ లోనే ఇప్పుడు వెస్టిండీస్ పై వాళ్ళ గడ్డపై విక్టరీ అందుకుంది. ఈ అద్భుతమైన ఘనత నేపథ్యంలో బాబర్ ఆజంను అందరూ మెచ్చుకుంటున్నారు. బాబర్ కెప్టెన్సీలో 21 టెస్టులు ఆడిన పాకిస్తాన్… 11 మ్యాచ్‌లలో గెలిచింది. ఇక ఈ విజయం పై కమ్రాన్ అక్మల్ రియాక్ట్ అయ్యారు. బాబర్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే విజయం వచ్చిన నేపథ్యంలో విర్రవీగకుండా.. టీమ్ ఇండియాను కూడా ఇలాగే ఓడించాలని కోరారు. భవిష్యత్తులో టీమిండియాతో టెస్ట్ సిరీస్ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో… బాబర్ ఆజం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబర్ ఆజం ఆడుతున్నాడు..ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live