Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

Big TV Live 1 week ago

Celebrity Wedding Destinations In India| విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నారా? అయితే ఒక్కసారి భారత్‌లోని ఈ అద్భుతమైన ప్రదేశాలను చూడండి.

సెలబ్రిటీలు సైతం తమ జీవితంలోని స్పెషల్ రోజు ఇక్కడే గ్రాండ్‌గా జరుపుకుంటారు. సరస్సుల అందం నుంచి సముద్ర తీరాలు, కొండ ప్రాంతాలు, చారిత్రక ఆలయాల వరకు.. మీ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం భారత్‌లోనే ఎన్నో అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే భారతీయులు.. పెళ్లిళ్లు, సెలవుల కోసం దేశంలోని పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవాలని ప్రోత్సహించారు. భారత ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఇటీవల "వెడ్ ఇన్ ఇండియా" అనే ఆలోచనను ప్రోత్సహించారు. దేశంలోని అందమైన ప్రాంతాల్లోనే వివాహాలు, ఇతర ముఖ్యమైన వేడుకలను జరుపుకోవాలని ఆయన కాబోయే దంపతులకు సూచించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ పెళ్లిళ్ల కోసం భారతీయ డెస్టినేషన్లను ఎంచుకున్నారు.

ఉదయ్‌పూర్‌ ఎంచుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

సినిమా స్టార్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లోని మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్, ఎకలవ్యలో జరుపుకున్నారు. అరవళ్లి కొండల మధ్య ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్ ఉడయ్‌పూర్ నగరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వివిధ రకాల వివాహ వేడుకలకు అనువైన ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి ప్రాంగిని లాన్‌లో వివాహ, ఇతర ఫంక్షన్లు గ్రాండ్‌గా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్ల కోసం పూల్‌సైడ్ లాన్, ఉదయ్‌పూర్ స్టేటరూమ్ వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి.

ఉదయ్‌పూర్ ప్రైవేట్ ఐలాండ్‌లో నూపుర్ సనోన్, స్టెబిన్ బెన్ వివాహం

నూపుర్ సనోన్, గాయకుడు స్టెబిన్ బెన్ తమ మూడు రోజుల వివాహ వేడుకలు రాఫెల్స్ ఉదయ్‌పూర్‌లో జరుపుకున్నారు. ఈ రిసార్ట్ ఉదయ్ సాగర్ సరస్సులోని 21 ఎకరాల ప్రైవేట్ ఐల్యాండ్ (ద్వీపం) లో ఉంది. అతిథులు పడవలో రిసార్ట్‌కు చేరుకోవడం ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఇక్కడ మొత్తం 137 గదులు, సూట్లు, విశాలమైన లాన్లు ఉన్నాయి. 9,000 చదరపు అడుగుల గ్రాండ్ బాల్‌రూమ్ కూడా అందుబాటులో ఉంది. సంప్రదాయ వివాహ కార్యక్రమాల కోసం ప్రత్యేక గార్డెన్ టెంపుల్ ఉంది.

హిల్ స్టేషన్‌లో ఒలంపిక్ ఛాంపియన్ పెళ్లి

ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, హిమానీ మోర్ ల పెళ్లి.. హిమాచల్ ప్రదేశ్‌లోని సూర్యవిలాస్ లగ్జరీ రిసార్ట్ అండ్ స్పాలో జరిగింది. ఈ రిసార్ట్ సోలన్‌ నగరంలోని కుమార్‌హట్టిలో ఉంది.
చుట్టూ కొండల అందం ఉండటంతో ప్రకృతి మధ్య ప్రశాంతమైన వివాహం కోరుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇండోర్ హాళ్లతో పాటు అవుట్‌డోర్ వేడుకలకు కూడా ప్రదేశాలు ఉన్నాయి. అతిథుల వసతి కోసం ఇక్కడ మంచి హిమాలయన్ కాటేజీలు, గదులు ఉన్నాయి.

గోవాలో నటి రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ 2024లో గోవాలోని ఐటిసి గ్రాండ్ గోవాలో వివాహం చేసుకున్నారు. 45 ఎకరాల్లో విస్తరించిన ఈ రిసార్ట్ అరొసిమ్ బీచ్ సమీపంలో ఉంది. బీచ్ అందాలతో పాటు అందమైన గార్డెన్లు, ఇండోర్ వేడుకల కోసం హాళ్లు ఉన్నాయి. పెద్ద ఫంక్షన్లు జరుపుకునేందుకు సీసైడ్ లాన్స్‌ బాగుంటాయి. మేజికల్ ఫారెస్ట్ మరింత ప్రైవేట్ అవుట్‌డోర్ వేడుకలకు అనుకూలంగా ఉంటుంది.

సిరిపురంలో నటుడు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ పెళ్లి

ప్రముఖ నటి అదితి రావు హైదరీ, తెలుగు తమిళ హీరో సిద్ధార్థ్ తెలంగాణలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో తమ వివాహం చేసుకున్నారు. సిరిపురంలోని ఈ చారిత్రక ఆలయానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం నిర్మాణం విజయనగర శైలిని ప్రతిబింబిస్తుంది. రత్న పుష్కరిణి సరస్సు సమీపంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ సెలిబ్రిటీ జంట పెద్ద రిసార్ట్‌కు బదులుగా దక్షిణ భారత సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం విశేషం.

భారత్‌లోనే ఎన్నో వెడ్డింగ్ ఆప్షన్లు

ఉదయ్‌పూర్ సరస్సుల నుంచి గోవా బీచ్‌ల వరకు భారత్‌లో విభిన్న వివాహ అనుభవాలు లభిస్తాయి. హిమాచల్ కొండలు, తెలంగాణ చారిత్రక ఆలయాలు కూడా ప్రత్యేకమైన ఎంపికలుగా నిలుస్తాయి.
అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనిసరిగా లేదు. లగ్జరీ, ప్రకృతి, సంప్రదాయం, సంస్కృతి కోరుకునే ప్రతి జంటకు భారత్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live