Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలు ఎప్పటికీ కలర్ ఫుల్ గా ఉంటాయి. ప్రేమ కథలతో ఇవి ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. అయితే వీటిలో మరో రకం సినిమాలు కూడా ఉన్నాయి.
ప్రేమ పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకునే అడల్ట్ మూవీస్ అన్నమాట. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో బోల్డ్ కంటెంట్ రసవత్తరంగా ఉంటుంది. భార్యను వదిలేసి స్టూడెంట్స్ వెంట పడే ఒక ప్రొఫెసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో బూతు, గ్లామర్, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం లాంటి సీన్లు దట్టించి ఉంటాయి కాబట్టి, ఇది ఫ్యామిలీతో కలిసి చూసే బొమ్మ అయితే అస్సలు కాదు. కేవలం మసాలా కోరుకునే మాస్ ఆడియన్స్ కోసం తీసిన లోబడ్జెట్ సినిమా ఇది.
యూట్యూబ్ లో స్ట్రీమింగ్
ఈ తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘అనాగరిగం’ (Anaagarigam). 2011లో వచ్చిన ఈ సినిమాను, తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఈ సినిమాలో విభు రామన్, ప్రజ్వాల్ పూవయ్య, వహీదా, బబిలోన ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణ దేవన్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా 1 గంట 55 నిమిషాల నిడివితో, లో బడ్జెట్‌లో తెరకెక్కించారు. దీనికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది, ఎందుకంటే ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. తమిళంలో రూపొందిన ఈ చిత్రం, అప్పట్లో ఉన్న చిన్న సినిమాల ట్రెండ్‌లో భాగంగా గ్లామర్, సస్పెన్స్‌ని నమ్ముకుని విడుదలయ్యింది. ఇది థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, యూట్యూబ్ లో ఈ సినిమాకు లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. ముఖ్యంగా బబిలోన వంటి నటీమణులు ఉండటం వల్ల అప్పట్లో మాస్ ఆడియన్స్‌లో ఈ సినిమాకు కొంత క్రేజ్ లభించింది. ఈ బోల్డ్ సినిమాకు ఐయండిబిలో 6.9/10 రేటింగ్ ఉండటం విశేషం.
స్టోరీ ఏమిటంటే
ఒక కాలేజీ ప్రొఫెసర్ పెళ్ళయ్యి కొత్తగా కాపురానికి వస్తాడు. భార్యతో హ్యాపీగా ఉండాల్సింది పోయి, తన దగ్గర చదువుకునే ఒక స్టూడెంట్ మీద కన్నేస్తాడు. ఆమెను మాయమాటలతో లోబరుచుకుని అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఈ ప్రొఫెసర్ చేసే పాడు పనులు అక్కడితో ఆగవు, తన భార్య స్నేహితురాలితో కూడా వెకిలిగా ప్రవర్తిస్తూ అందరితో చిక్కులు కొనితెచ్చుకుంటాడు. ఇటు పక్క భార్య పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇంట్లో ప్రొఫెసర్ లేని టైంలో ఒక సేల్స్ మెన్ వచ్చి ఆమెను లైన్లో పెడతాడు.
ఇటు భర్త బయట అమ్మాయిలతో తిరుగుతుంటే, అటు భార్య ఇంట్లో ఈ సేల్స్ మెన్ తో సంబంధం పెట్టుకుంటుంది. ఇలా ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఒకరికొకరు తెలియకుండా పక్కదారుల్లో వెళ్తూ సంసారాన్ని రోడ్డు మీదకు తెచ్చుకుంటారు. చివరికి ఈ అక్రమ సంబంధాల వల్ల అందరి జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఒకరి తప్పులు మరొకరికి తెలియడం, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవాలని చూడటంతో కథ మొత్తం గందరగోళంగా మారుతుంది. పద్ధతిగా ఉండాల్సిన చదువుకున్న వాళ్లే ఇలా అనాగరికంగా ప్రవర్తిస్తే జీవితాలు ఎలా నాశనం అవుతాయనేదే ఈ సినిమా క్లైమాక్స్.

