Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు అండగా హీరో నిఖిల్.. ట్రస్ట్ పై ఊహించని రియాక్షన్!

విద్యార్థులకు అండగా హీరో నిఖిల్.. ట్రస్ట్ పై ఊహించని రియాక్షన్!

Big TV Live 2 weeks ago

సిkhil:సినిమాలలో అవకాశాలు వచ్చాయా.. నటించామా.. డబ్బులు తీసుకున్నామా.. వెళ్ళిపోయామా.. అన్నట్టు కాకుండా.. వచ్చిన డబ్బును నలుగురికి ఉపయోగపడేలా చేస్తూ..

అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు కొంతమంది హీరోలు. ముఖ్యంగా సినిమాల ద్వారా, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా, బిజినెస్ ల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పేదలకు, నిరుపేద విద్యార్థులకు ఉపయోగిస్తూ.. తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ , చిరంజీవి, సోనుసూద్ , సూర్య , రాఘవ లారెన్స్ లాంటి ఎంతోమంది హీరోలు తెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా హీరోలు అనిపించుకుంటూ ఎంతోమందికి ఆర్థికంగా కూడా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

వెయ్యి మంది విద్యార్థులకు అండగా హీరో నిఖిల్..

అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కుర్ర హీరో వచ్చి చేరారు. ఆయన ఎవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్. వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో ఆయన ఒక గొప్ప పని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా వెయ్యి మంది విద్యార్థులకు అండగా నిలిచి భవిష్యత్తులో ట్రస్ట్ పెట్టడం పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

చదువు ఉంటేనే జీవితం..

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా తన టీంతో కలిసి భీమవరం వెళ్లిన ఈయన.. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్న ఒకటవ తరగతి నుండి 5వ తరగతి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు సుమారుగా 1000 మంది పిల్లలకు ఈరోజు స్టేషనరీ కిట్స్ , చదువుకోవడానికి కావలసిన ఒక గిఫ్ట్ యాంపర్ లాంటివి ఇచ్చారు. ఇక దీనిపై నిఖిల్ మాట్లాడుతూ.. ఈ మంచి కార్యక్రమం కోసం ఈరోజు భీమవరం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని నేను హైదరాబాదులోనే చేసేవాడిని కాకపోతే ఇప్పుడు అన్ని ప్రాంతాలలో కూడా ఇలా చేయాలని మొదట భీమవరం నుంచే మొదలు పెట్టాను. అన్ని దానాల కంటే విద్య దానం గొప్పది.. నేను సినిమాల్లోకి రాకముందు స్కూల్లో ఎలా చదువుకునే వాడిని.. చదువు వల్లే ఈరోజు ఇంతటి వాడినయ్యాను అని , ఫ్యూచర్లో ఎవరు ఏమి అవ్వాలనుకున్నా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని నా జీవిత కథను పిల్లలకు చెప్పాను.. వాళ్లతో మాట్లాడి వాళ్ళని చదువు వైపు వెళ్లేలా వారిని ప్రోత్సహించాను.

సొసైటీ కి తిరిగిచ్చే టైం వచ్చింది..

ముఖ్యంగా పుస్తకాలు, పెన్నులు, వాళ్ళు చదువుకోవడానికి అవసరమైన ప్రతి వస్తువును ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక యాక్టర్ గా స్క్రీన్ మీదే కాదు సొసైటీకి ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలి అనేది ఈ ప్రయత్నం..ముఖ్యంగా వెయ్యి మంది పిల్లలకు ఇలా కిట్స్ తయారు చేసి అందివ్వడానికి నా వెనకుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ నిఖిల్ తెలిపారు.

ఫ్యూచర్లో ట్రస్ట్ పెట్టే ఆలోచన..

ఇకపోతే భవిష్యత్తులో ట్రస్ట్ పెట్టే ఆలోచనపై కూడా నిఖిల్ మాట్లాడారు. "ట్రస్ట్ అనేది ఖచ్చితంగా పెడతాం అయితే ట్రస్ట్ పెట్టినప్పుడే సేవ చేయాలన్న రూల్ ఏమి లేదు కదా.. ఏదో నా వంతుగా.. ఉడతా భక్తిగా నేను చేస్తున్న ప్రయత్నం ఇది. కరోనా సమయంలో కూడా నాకు అనిపించింది చేశాను. ప్రతి సంవత్సరం కూడా పబ్లిసిటీ లేకుండానే చేసేవాడిని. ముఖ్యంగా నేను ఎంతోమందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అలాగే నన్ను చూసి కూడా ఎంతో కొంత మంది ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

ప్రమోషన్స్ లో భాగమేనా?

ఇకపోతే తాజాగా నిఖిల్ అందించిన ఈ బుక్స్ కిట్స్ పై స్వయంభూ సినిమా పోస్టర్ ఉండడం గమనార్హం. ఇక ఈ పోస్టర్ చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం సేవ పేరిట సినిమా ప్రమోట్ చేసుకుంటున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live