Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ చూపు ఎటు వైపు.. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసేదెవరితో?

విజయ్ చూపు ఎటు వైపు.. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసేదెవరితో?

Big TV Live 3 weeks ago

TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించింది. ఇప్పటికే 100 సీట్లు గెలుచుకోగా.. మరో 7 స్థానాల్లో లీడ్ లో ఉంది. అయితే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి.

ఈ నేపథ్యంలో విజయ్ తో కలిసొచ్చే పార్టీలు ఏవో అనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకి కాంగ్రెస్‌, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ కీలకం

కాంగ్రెస్‌, డీఎండీకే, లెఫ్ట్‌ పార్టీలు డీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అన్బుమణి రాందాస్‌ పీఎంకే మాత్రం ఎన్డీయేతో కలిసి పోటీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ తగ్గడంతో.. టీవీకేతో కలిసి రావాలని విజయ్ తండ్రి కాంగ్రెస్‌ ను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే కాంగ్రెస్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అప్పటికే డీఎంకేతో కలిసి పోటీ చేస్తుండడంతో టీవీకే ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ కాంగ్రెస్ తన అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

చిన్న పార్టీల మద్దతు ఎవరికో

ప్రస్తుత ఫలితాల్లో కాంగ్రెస్‌కు 5 సీట్లు, పీఎంకేకు 5, లెఫ్ట్‌ పార్టీలకు చెరో 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. దీంతో మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు రూట్ క్లియర్ అవుతుంది. అయితే చిన్న చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లే బదులుగా అన్నాడీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు. తుది ఫలితాలు వెళ్లడయ్యాక ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రానుంది.

సంకీర్ణంతో సమస్యలు

ఎక్కువ పార్టీలతో కలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. పోర్ట్ పోలియోలు, కీలక పోస్టులు.. అలకలు, ఇలా అనేక సమస్యలు మొదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఏఐఏడీఎంకేతో కలిస్తే.. రాజకీయ, ప్రభుత్వ అనుభవం ఉన్న పార్టీ కాబట్టి.. టీఎంకేకు భవిష్యత్తులో సమస్యలు మొదలవుతాయని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో కీలకంగా మారింది. చిన్న పార్టీల మద్దతు కోరతారా? ఏఐఏడీఎంకేతో జట్టు కడతారా? వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live