Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ దేవరకొండ కోసం బాలీవుడ్ బ్యూటీని దింపబోతున్న శౌర్యవ్ !

విజయ్ దేవరకొండ కోసం బాలీవుడ్ బ్యూటీని దింపబోతున్న శౌర్యవ్ !

Big TV Live 2 months ago

VD ×Shouryuv: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల వరుస సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.

అయితే ఈ సినిమాలు షూటింగ్ పూర్తి కాకుండానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరొక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల హాయ్ నాన్న దర్శకుడు శౌర్యవ్(Shouryuv) దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రావడమే కాకుండా ఇటీవల పూజ కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో విజయ్ సినిమా..

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. విజయ్ దేవరకొండ జంతువులను పట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ శౌర్యవ్ ఈ సినిమాల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలన్న నేపథ్యంలో శౌర్యవ్ బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నట్టు సమాచారం.

నేషనల్ అవార్డు విన్నర్..

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారని ఇండస్ట్రీ సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా అందుకున్న నటి కృతి సనన్ (Kritisanon)ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. ఈమెకు ఈ సినిమా స్టోరీ వినిపించడంతో ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దర్శకుడు హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.

విజయ్ దేవరకొండకు జోడిగా కృతి సనన్ ..

ఇలా విజయ్ దేవరకొండకు జోడిగా కృతి సనన్ నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫ్రెష్ జోడి అంటు కొంతమంది కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం అసలు వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో కృతి సనన్ భాగం కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రణబాలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ విజయ్ జోడిగా నటించగా, రణబాలి సినిమాలో రష్మిక మందన్న నటించడం విశేషం. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా మొదటిసారి ఈ సినిమా ద్వారా వెండితెరపై సందడి చేయనున్నారు.

44 ఏళ్ల తరువాత ఓటీటీలోకి వస్తున్న కమల్ శ్రీదేవి బ్లాక్ బస్టర్ సినిమా..వారికి నిరాస తప్పదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live