Dailyhunt
విజయ్ విజయం..స్పందించిన టాలీవుడ్..మౌనం వహిస్తున్న ఆ పాన్ ఇండియా స్టార్స్?

విజయ్ విజయం..స్పందించిన టాలీవుడ్..మౌనం వహిస్తున్న ఆ పాన్ ఇండియా స్టార్స్?

Big TV Live 4 days ago

TVK Vijay: తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలలో ఊహించని విధంగా సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్(TVK Vijay) 108 స్థానాలలో విజయం సాధించారు.

ఇలా మొదటిసారి ఈయన ఎన్నికలలో పోటీ చేశారు అయితే ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి ఈ స్థాయిలో మెజారిటీ సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ విధంగా నటుడు విజయ్ ఎన్నికలలో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తమిళ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క హీరో విజయ్ కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

విజయ్ కు టాలీవుడ్ అభినందనలు..

టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి నుంచి మొదలుకొని బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబుతో పాటు యువ హీరోలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ సాధించిన విజయం పట్ల అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేశారు. మరోవైపు హీరోయిన్లు కూడా సోషల్ మీడియా వేదికగా నటుడు విజయ్ కు అభినందనలు తెలియజేశారు కానీ పాన్ ఇండియా స్టార్ హీరోలైన ఎన్టీఆర్(Jr.NTR), అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్ (Prabhas)ఇప్పటివరకు హీరో విజయ్ ఎన్నికలలో సాధించిన విజయం పట్ల ఎక్కడ స్పందించలేదు.

విజయ్ విషయంలో సైలెంట్ అయిన స్టార్స్..

ఈ ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ విష్ చేయకపోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. విజయ్ సాధించిన విజయం పట్ల టాలీవుడ్ మొత్తం ఏకతాటి పైకి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కానీ ఈ ముగ్గురు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు దీంతో విజయ్ విషయంలో ఎందుకు ఈ ముగ్గురు సైలెంట్ అయ్యారు? విష్ చేయకపోవడానికి ఏదైనా కారణముందా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

రాకా పనులలో బిజీగా బన్నీ..

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమాలన్ని కూడా తమిళ డైరెక్టర్లతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ రాక సినిమా పనులలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా తదుపరి చిత్రాన్ని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నారు. అల్లు అర్జున్ తమిళ దర్శకులతో పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న నటుడు విజయ్ కు అభినందనలు తెలియచేయకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ పాన్ ఇండియా హీరోలు విజయ్ కు అభినందనలు తెలియజేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు తమ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిజీగా ఉండగా, ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live