Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
VIP Darshan: మంత్రికే మస్కా కొట్టిన అర్చకుడు.. మాస్క్ తీయగానే పూజారికి ఫ్యూజులు అవుట్..?

VIP Darshan: మంత్రికే మస్కా కొట్టిన అర్చకుడు.. మాస్క్ తీయగానే పూజారికి ఫ్యూజులు అవుట్..?

Big TV Live 2 weeks ago

VIP Darshan: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో సముద్ర తీరాన ఉన్న తిరుచెందూరు మురుగన్ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి దర్శనం కోసం క్యూలో జనాలు వేచి చూస్తూ ఉంటారు.

అయితే కొంత కాలంగా ఈ ఆలయంలో విఐపి దర్శనాల పేరుతో సామాన్య ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ సంఘటనపై స్పందించిన మంత్రి రమేష్ నేరుగా ఆలయంలో నిజా నిజాలను తెలుసుకోవడం కోసం సాదారణ వ్యక్తిలా మారు వేశంలో వచ్చి తెలుసుకున్నారు.

Also read: ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

మంత్రి నుండి 4000 వసూలు..

తిరుచెందూరు మురుగన్ ఆలయంలో జరుగుతున్న అర్చకుల అవినీతిని పసిగట్టేందుకు మంత్రి రమేష్ మారు వేశంలో వెల్లారు. మోహనికి మాస్క్ దరించి, అచ్చం సామాన్య భక్తుడిలా గుడికి వచ్చారు. దీంతో ఓ అర్చకుడు వచ్చి మీకు వీఐపీ దర్శనం చేయిస్తానని మంత్రి నుంచి రూ. 4000 వసూలు చేశాడు. అర్చకుడికి గూగుల్ పే ద్వారా రూ. 4000 లను మంత్రి రమేష్ చెల్లించారు. దీంతో దర్శనం అనంతరం మంత్రి మాస్క్ తీసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో మంత్రిని చూసిన అర్చకుడు భయంతో పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహనికి గురైన మంత్రి రమేష్ అర్చకుడితో పాటు, మరో భద్రతా సిబ్బందిని అధికారులు సస్సెండ్ చేశారు. మంత్రి సాధారన వ్యక్తిలా వచ్చి భక్తుల కష్టాలను తెలుకుంన్నందుకు అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live