Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విరాట్ కోహ్లీ ఇంత కామాంధుడా ?..స్టేడియంలో పడుకొని రొమాన్స్ చేస్తున్నాడంటూ

విరాట్ కోహ్లీ ఇంత కామాంధుడా ?..స్టేడియంలో పడుకొని రొమాన్స్ చేస్తున్నాడంటూ

Big TV Live 3 weeks ago

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే.

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Gujarat Titans vs Royal Challengers Bangalore ) మధ్య నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ.. 75 పరుగులతో రెచ్చిపోయాడు. టార్గెట్ చిన్నదైన నేపథ్యంలో మెల్లగా ఆడుతూ, జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో రెండోసారి ఛాంపియన్ అయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే, చేజింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) చేసిన ఓ పని వివాదంగా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Ravichandran Ashwin: వైభవ్ రెండుస్లార్లు సెంచరీ మిస్‌..కన్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

గాయం పేరుతో డ్రామాలు..స్టేడియంలో పడుకొని రొమాన్స్

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లు పడ్డ నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లో పడింది బెంగళూరు. ఈ క్రమంలో కోహ్లీ అన్ని బాధ్యతలు మీద వేసుకొని.. జట్టును ముందుకు సాగించాడు. ఈ క్రమంలోనే అతనికి నడుము నొప్పి లేసినట్లు, అంపైర్లకు తెలిపాడు. ఈ క్రమంలోనే బెంగళూరు జట్టుకు సంబంధించిన ఫిజియో, రంగంలోకి దిగి.. విరాట్ కోహ్లీకి ట్రీట్మెంట్ అందించారు. మైదానంలో పడుకున్న విరాట్ కోహ్లీ, ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. వీపు పైన బెంగళూరు ఫిజియో మసాజ్ చేస్తున్న క్రమంలో… ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మతో ( Anushka Sharma) సొల్లు మొదలుపెట్టాడు.

మైదానంలో పడుకొని ఆమెతో రొమాన్స్ చేశాడు. గాల్లో ముద్దులిస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. బెడ్ రూమ్ లోకి వెళ్ళాక ఇవన్నీ చేసుకోవాలి తప్ప… స్టేడియంలో ఈ వెధవ వేషాలు ఎందుకు ? అంటూ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీతో పాటు అనుష్క శర్మకు కొంచెం కూడా సిగ్గు లేదని ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఒంటి చేత్తో ఫైనల్ మ్యాచ్ గెలిపించినందుకు విరాట్ కోహ్లీని మెచ్చుకోవాల్సింది పోగా.. కావాలని అతన్ని టార్గెట్ చేస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు. చేతకాని దద్దమ్మలు ఇలాగే వాగుతూ ఉంటారని, చురకలు అంటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఆర్సీబీ, గుజరాత్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ 75 పరుగులు చేయడమే కాదు, సిక్సర్ కొట్టి ఫినిష్ చేశాడు.

IPL 2026 Finals RCB VS GT: గుజరాత్ వర్సెస్ RCB మధ్య ఫైనల్స్..ముందే ఊహించిన అనన్య బిర్లా, పాత పోస్ట్ వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live