Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Virender Sehwag: వైభవ్ దెబ్బకు SRH బౌలర్లు వారం రోజులు నిద్రపోరు !

Virender Sehwag: వైభవ్ దెబ్బకు SRH బౌలర్లు వారం రోజులు నిద్రపోరు !

Big TV Live 2 weeks ago

Virender Sehwag : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో భయంకరమైన బ్యాటింగ్ తో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరాచకం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాటింగ్ మొదలైన నుంచి ఔట్ అయ్యేవరకు ఒకటే బాదుడు.. ఒకప్పుడు క్రిస్ గేల్ తోపు ఆటగాడు అనుకున్నారు.. కానీ అంతకుమించి ఆటతో ఈ 15 ఏళ్ల బుడ్డోడు రెచ్చిపోతున్నాడు. ఎక్కడ బంతులు వేసినా సిక్సర్లు కొడుతున్నాడు. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి పాట్ కమిన్స్ లాంటి వరల్డ్ క్లాసు బౌలర్లకు కూడా ముచ్చెమటలు పట్టించాడు వైభవ్. అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీ పై తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ దెబ్బకు హైదరాబాద్ బౌలర్లు వారం రోజులపాటు నిద్రపోవడం కష్టమే అంటూ బాంబు పేల్చారు. వాడి వీరబాదును చూసి, నిద్రలో కూడా కలవరించడం గ్యారంటీ అని సెటైర్లు పేల్చారు.

Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో

వైభవ్ దెబ్బకు SRH బౌలర్లు వారం రోజులు నిద్రపోరు !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఎలిమినేషన్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ చేసిన భయంకరమైన బ్యాటింగ్ పై వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ఇదేం కొట్టాడు రా నాయనా అంటూ ఆయన కామెంట్స్ చేశారు. వీడి దెబ్బకు హైదరాబాద్ బౌలర్లు బెంబేలెత్తిపోయారని బాంబు పేల్చారు. ఇలా కొడితే బౌలర్ బంతులు వేయడానికి కూడా వనికి పోతాడని షాకింగ్ కామెంట్స్ చేశారు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ).

వైభవ సూర్యవంశీని 30 కోట్లకు కొనడం గ్యారెంటీ

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వేలంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని దాని పైన కూడా వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ వేలంలోకి వస్తే, ఏకంగా 30 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం గ్యారెంటీ అని వెల్లడించారు. తాను కూడా ఫాస్ట్ గా సెంచరీలు బాధని.. కానీ ఈ బుడ్డోడు చేసిన విధ్వంసం ఎప్పుడు సృష్టించలేదని వ్యాఖ్యానించారు. తాను టీమిండియా సెలెక్టర్ అయి ఉంటేనా.. వెంటనే జట్టులోకి తీసుకొని ఓపెనర్ గా దింపే వాడినని వెల్లడించారు. బిసిసిఐ కూడా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. తన అంచనా ప్రకారం అతి త్వరలోనే టి20 జట్టులోకి వైభవ్ సూర్య వంశీ వస్తాడని కూడా పేర్కొన్నారు. అతడు టి20 జట్టులోకి వస్తే చాలామంది ప్లేయర్లు పక్కకు జరగాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ).

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live