Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివక్షపై వినూత్న నిరసన.. గుండు గీయించుకున్న బీజేపీ మహిళా కౌన్సిలర్!

వివక్షపై వినూత్న నిరసన.. గుండు గీయించుకున్న బీజేపీ మహిళా కౌన్సిలర్!

Big TV Live 16 hrs ago

Firozabad: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓక వింతైన, తీవ్రమైన నిరసన చోటుచేసుకుంది. అధికార బీజేపీకే చెందిన మహిళా కౌన్సిలర్ ఉషా దేవి తన వార్డుపై వివక్ష చూపిస్తున్నారంటూ కార్పొరేషన్ కార్యాలయం ముందే నిరసనకు దిగారు.

అంతటితో ఆగకుండా.. అందరూ చూస్తుండగానే అక్కడ కూర్చొని గుండు గీయించుకోవడం స్థానికంగా తీవ్ర సంచలన సృష్టించింది.

వార్డు నంబర్ 51 కౌన్సిలర్‌గా ఉన్న ఉషా దేవి మాట్లాడుతూ.. తన పరిధిలోని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస అభివృద్ధి పనులను కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మేయర్ భర్త జోక్యం చేసుకుంటూ తన వార్డుకు నిధులు రాకుండా వివక్ష చూపిస్తున్నారని, దీనివల్ల ప్రజలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ అవమానాన్ని తట్టుకోలేక నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అయితే, ఈ వ్వవహారంపై మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డులకు సమానంగానే నిధులు కేటాయిస్తున్నామని, ఎక్కడా వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ కౌన్సిలరే ఇలా మున్సిపల్ ఆఫీస్ ముందు గుండు గీయించుకోవడంతో ఈ ఉదంతం కాస్తా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

యూపీలో కలకలం.. అత్యాచార నిందితుడికి పూలదండలు, భుజాలపై ఊరేగింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live