Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన అగ్నికీలలు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన అగ్నికీలలు

Big TV Live 1 week ago

Yadadri: నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ స్టేషన్ (YAMTPS) లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్లాంట్‌కు చెందిన యూనిట్-3 పరిధిలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

చూస్తుండగానే అగ్నికీలలు ఎగసిపడటంతో పాటు, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. దీంతో అక్కడి కార్మికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగారు. ప్లాంట్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ లేదా నిర్మాణ పనుల వద్ద జరిగిన ఏదైనా పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టం, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live