Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

Big TV Live 1 week ago

Apple Camera AirPods: యాపిల్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈసారి సౌండ్ మాత్రమే కాకుండా.. మన కంటికి కనిపించే ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకునేలా ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేసే పనిలో పడింది.

సాధారణంగా కేవలం పాటలు వినడానికి, ఫోన్ మాట్లాడటానికి వాడే ఈ ఇయర్‌ఫోన్స్‌లో కెమెరాలను అమర్చి, సరికొత్త వేరబుల్ టెక్నాలజీని పరిచయం చేయడానికి సంస్థ సిద్ధమవుతోంది.

రెండు విభిన్న మోడళ్లపై ప్రయోగాలు:

యాపిల్ ప్రస్తుతం అంతర్గతంగా B790, B798 అనే కోడ్ పేర్లతో రెండు రకాల కెమెరా ఎయిర్‌పాడ్స్ మోడళ్లను పరీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో B790 మోడల్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఐవోఎస్ కోడింగ్‌లో కూడా దీనికి సంబంధించిన వివరాలు కనిపించడంతో, అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే ఐఫోన్లతో పాటు సెప్టెంబర్‌లోనే ఇవి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో మోడల్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు.

విజువల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు:

ఈ ఎయిర్‌పాడ్స్ కేవలం ఫొటోలు తీయడానికి కాకుండా, మన చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. చెవులకు పెట్టుకున్నప్పుడు ఇరువైపులా ఉండే చిన్న కెమెరాలు మన ముందర ఉన్న వస్తువులను, ప్రముఖ ప్రాంతాలను, లేదా పేపర్‌పై ఉన్న అక్షరాలను గుర్తించి సమాచారాన్ని అందిస్తాయి. ఉదా: మనం చూసే కూరగాయలను బట్టి ఏ వంటకం చేయాలో కూడా Siri మనకు సలహా ఇస్తుంది.

కొత్తగా డిజైన్, మార్కెట్ అంచనాలు:

కెమెరా హార్డ్‌వేర్ అమర్చడం కోసం ఈ ఎయిర్‌పాడ్స్ పొడవు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే డేటా ప్రాసెస్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఎల్ఈడీ లైట్ వెలిగేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పాడ్స్ కంటే వీటి తయారీ ఖర్చు, ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. యాపిల్ వీటిని సాధారణ ప్రాక్సిరీస్ కాకుండా AirPods Ultra పేరుతో విడుదల చేసే ఆలోచనలో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live