Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

Big TV Live 2 weeks ago

Venuswamy : ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పిన ఆయన ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులారిటిని సొంతం చేసుకున్నారు.

హీరో హీరోయిన్ల పై ఈయన చేస్తున్న వ్యాఖ్యలు జనాలకి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్ అయిపోయారు వేణు స్వామి. ఇటీవల కాలంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. కేవలం సెలబ్రిటీల గురించి మాత్రమే కాదు అటు రాజకీయాల గురించి కూడా ఈయన ప్రస్తావించడంతో ఈయన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఇకపోతే వేణు స్వామి ఏం చెప్పినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఓ యంగ్ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు అలాగే హీరోయిన్ కూడా చనిపోతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆ హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అసలు వేణు స్వామి ఎందుకు అలా చెప్పాడు అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

యంగ్ హీరో సూసైడ్..?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సెలబ్రిటీల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. సెలబ్రిటీల పూజల గురించి వివరించిన ఆయన త్వరలోనే ఓ యంగ్ హీరో సూసైడ్ చేసుకుని చనిపోతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఓ యంగ్ హీరో అంటే 45 ఏళ్ల లోపల ఉన్న హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. నేను చెప్పేది కొంతమంది నమ్మకపోవచ్చు 90 ఏళ్ల ముసలోడు చనిపోతే చనిపోయాడు అని అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు ఒక యంగ్ హీరో చనిపోతాడు అని చెప్పాను. ఆయన పేరు బయట పెట్టను అని వేణు స్వామి అన్నారు. మరి వేణు స్వామి చెప్పినట్లుగా ఆ యంగ్ హీరో ఎవరయి ఉంటారు అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఆ యంగ్ హీరో ఎవరు? ఎప్పుడు చనిపోతాడు అన్నది? ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

హీరోయిన్ మరణం అప్పుడే..?

ఇక తర్వాత వేణు స్వామి హీరో మాత్రమే కాదు ఒక హీరోయిన్ కూడా చనిపోతుంది అని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీని టెన్షన్ లో పడేసింది. హీరోయిన్ 2027-28 సంవత్సరాల్లో చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వీరిద్దరికీ ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌లోని మేష, వృశ్చిక రాశులకు చెందిన యంగ్ హీరోలు, హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారు.. మరి నిజంగానే ఈయన చెప్పినట్లుగా ఆ హీరో హీరోయిన్లు చనిపోతారా లేదా అన్నది ప్రస్తుతం జనాల్లో కూడా చర్చలకు దారి తీసింది.. వేణు స్వామి జాతకం గతంలో కొన్ని సార్లు మాత్రమే నిజమైంది. మరికొన్నిసార్లు ఆయన చెప్పిన జాతకాలు ఏవి నిజం కాకపోవడంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు కొట్టి పడేస్తున్నారు. ఇక నెక్స్ట్ వేణు స్వామి ఎవరి జాతకం గురించి చెప్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live