Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

Big TV Live 3 days ago

Naa Anvesh : ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తనకి సంబంధం లేని విషయాలను కూడా ప్రస్తావిస్తూ జనాలతో చివాట్లు తింటూ ఉన్నాడు.

కొన్ని రోజుల క్రితం నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో స్పందించి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. హిందూ దేవుళ్ళ పై అలాగే సనాతన ధర్మంపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దాంతో యూట్యూబర్ అన్వేష్ పై పలుచోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయన సోషల్ మీడియా అకౌంట్లో కూడా బ్లాక్ చేయబడ్డాయి. అయితే తాజాగా ప్రముఖ నటి, బిజెపి నేత మాధవి లత యూట్యూబర్ అన్వేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్గురు పై అన్వేష్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మీ నాన్న కండోమ్ వాడి ఉంటే..

గతంలో యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యల పై తాజాగా బీజేపీ నేత, సినీ నటి మాధవి లత స్పందించారు. సనాతన ధర్మాన్ని, పీఠాధిపతులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జగద్గురువును నా అన్వేష్ అవమానించేలా మాట్లాడారు. అది అసలు సహించబోము అంటూ ఆమె సీరియస్ అయ్యారు. వీడియోలో మాట్లాడుతూ.. బోల్డ్ పదజాలంనే వాడరు. నిన్ను కనే ముందు మీ నాన్న కండోమ్ వాడితే ఏం జరిగేది అంటూ ఆమె అన్వేష్ కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చింది. ఈ రోజు సమాజానికి ఈ దరిద్రం వదిలేది అంటూ అన్వేష్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.. మరి ఆమె వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ ఎలా స్పందిస్తారో అన్నది సస్పెన్స్ గా మారింది..

Also Read :Podarillu Today Episode : కేశవతో శైలు ప్రేమ .. నిజం చెప్పిన చక్రీ.. మహాకు షాక్ ఇవ్వనున్న భూషణ్..

ఖర్మ ఎవరిని వదలదు..

సనాతన ధర్మానికి, ఆధ్యాత్మిక గురువులను అవమానించేలా మాట్లాడిన అన్వేష్ అహంకారానికి నిదర్శనం అని ఆమె సీరియస్ అయ్యారు. నువ్వు ఎంతవాడిదైనా కానీ ఒక గురువు మీద చేసిన వ్యాఖ్యలకు త్వరలోనే కర్మ అనుభవిస్తావు అంటూ మాధవి లత అన్వేష్ పై ధ్వజమెత్తారు.. దేవుడి స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది, నీ పతనం త్వరలోనే చూస్తావు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చినీయాంశంగా మారింది. మాధవి లత తనకు తప్పు అనిపించింది ఏదైనా సరే అసలు వదలకుండా దానిపై పోరాడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు యూట్యూబర్ అన్వేష్ పై కూడా అదే విధంగా స్పందించి అతనికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేసింది. ఈమె ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఈమె చేసిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉండి రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live