Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబ్లో హీట్ పుట్టిస్తున్న 'తబాహీ'.. ఈ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి యష్!

యూట్యూబ్లో హీట్ పుట్టిస్తున్న 'తబాహీ'.. ఈ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి యష్!

Big TV Live 6 days ago

Toxic Movie:ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ నుండి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.

మూడు నెలల క్రితం లిరికల్ వీడియో రిలీజ్ చేస్తారని భావించిన అభిమానులకు నిరాశ కలిగిస్తూ కేవలం సౌండ్ ట్రాక్ ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు అభిమానులను ఖుషీ చేస్తూ ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు. కన్నడతో పాటూ పలు భాషలలో రిలీజ్ అయిన ఈ పాటలో యశ్, కియారా అద్వానీ తమ బోల్డ్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

తబాహీ సాంగ్ రిలీజ్..

తాజాగా విడుదల చేసిన తబాహీ పాట యూట్యూబ్లో హీట్ పుట్టిస్తూ.. ట్రెండింగ్లో నిలుస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో చూసిన నెటిజన్స్, ఆడియన్స్ ఈ బోల్డ్ పెర్ఫామెన్స్ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి తెలుగు లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. ఇందులో యశ్ రాయా పాత్రలో నటిస్తుండగా ..కియారా అద్వానీ నదియా పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన తబాహీ వీడియో సాంగ్ విషయానికి వస్తే.. ఈ పాటలో కియారా అద్వానీ, యశ్ తమ పర్ఫామెన్స్ తో హీట్ పుట్టించేశారు. అటు ఒకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటూనే హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సాంగ్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా విజువల్ వండర్ను కచ్చితంగా థియేటర్లలో చూడాలని, ఈ హాలీవుడ్ తీరు పెర్ఫామెన్స్ కి అభిమానులు పట్టం కడతారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి అయితే తాజాగా రిలీజ్ చేసిన ఈ పాట అటు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇకపోతే మరొకవైపు ఈ పాటపై విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి బోల్డ్ నటనను ఫ్యామిలీతో కలిసి చూడడం ఎలా అంటూ కొంతమంది మండిపడుతున్నారు. మరి దీనిపై ఇంకెన్ని కామెంట్లు వ్యక్తమవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తారా సుతారియా, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని నిరంజన్ మృతి!

నేను నిన్ను అక్కడ కలుస్తాను రూమీ – యశ్

ఇకపోతే ఈ వీడియో సాంగ్ ను యశ్ తన అధికారిక ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ..” తప్పు, ఒప్పు అనే భావనలకు అతీతంగా ఒక క్షేత్రం ఉంది. నేను నిన్ను అక్కడ కలుస్తాను.. రూమీ” అంటూ కన్నడ, హిందీ, తెలుగు ,తమిళ్, మలయాళం భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు. టాక్సిక్ సినిమా పెద్దల కోసం ఒక అద్భుతమైన కథ ప్రపంచవ్యాప్తంగా సినిమా హాల్లోకి ఆగస్టు 26న రాబోతోంది అంటూ ట్వీట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live