అరచేతులు, అరి కాళ్ళలో తిమ్మిర్లు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. తిమ్మిర్లు వచ్చినప్పుడు సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే తిమ్మిరి వచ్చిన భాగం స్వాధీనంలో లేకపోవడం, ఝుమ్మని లాగటం వంటివి ఉంటాయి.
ఎక్కువసేపు కదలకుండా అలా కూర్చున్నప్పుడు కూడా తిమ్మిర్లు వస్తాయి.
ఈ విధంగా తిమ్మిర్లు వచ్చినప్పుడు లేచి నాలుగు అడుగులు వేసి నడిస్తే తిమ్మిర్లు తగ్గుతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు తిమ్మిర్లు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.
ఎందుకంటే ఇది నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ తిమ్మిర్లు అనేవి సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారిలోనూ నరాలు ఒత్తిడికి గురైనప్పుడు, నరాల్లో రక్తప్రసరణ సరిగ్గా జరగనప్పుడు వస్తాయి.
ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే ఇంటి చిట్కాలు కూడా పనిచేస్తాయి. అయితే డాక్టర్ సూచనలను పాటిస్తూ మాత్రమే ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. సొరకాయను సర్కిల్ గా కట్ చేసి గాటులు పెట్టి తిమ్మిర్లు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఈ విధంగా రాత్రి పడుకునే ముందు చేస్తే నిద్ర బాగా పడుతుంది.
ధనియాలు, సోంపు, పటిక బెల్లం ఈ మూడింటిని సమానం మొత్తంలో తీసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని నిలవ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం అర స్పూన్ మోతాదులో ఈ పొడిని తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
దాదాపుగా నెల రోజులపాటు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ తిమ్మిర్లు సమస్య ఉన్నప్పుడు డాక్టర్ని మాత్రం తప్పనిసరిగా సందర్శించాలి.
ఇవి కూడా చదవండి:
- గుడ్డులో ఈ పొడి కలిపి రాస్తే చాలు.. జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది!
- ముఖంపై మచ్చలు, మొటిమలు మాయం.. కలబందలో ఈ ఒక్కటి కలిపి రాసి చూడండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

